పనులు నాణ్యతతో చేపట్టాలి  

పనులు నాణ్యతతో చేపట్టాలి  

రామకృష్ణాపూర్,ముద్ర : మున్సిపాలిటీలో చేపట్టబోయే అభివృద్ధి పనులను నాణ్యతతో చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) బీ.రాహుల్ మున్సిపల్ అసిస్టెంట్ ఇంజనీర్ అచ్యుత్ ను ఆదేశించారు. బుదవారం మున్సిపల్ కమిషనర్ వెంకటనారాయణతో కలిసి చేపట్టబోయే అభివృద్ధి పనులకు సంబంధించిన ఏరియాలను రాహుల్ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ విద్యా సాగర్,వార్డు కౌన్సిలర్ తిరుపతి,రాజు తదితరులు పాల్గొన్నారు.