పరీక్షలు రద్దు

పరీక్షలు రద్దు

ప్రశ్నాపత్రం లీకైనట్లుగా తేలడంతో పలు పరీక్షలను రద్దు చేస్తున్నట్లు టీఎస్​పీఎస్సీ ప్రకటించింది. అసిస్టెంట్​ ఇంజనీర్​, మున్సిపల్​ ఇంజినీర్​, టెక్నికల్​ ఆఫీసర్​, జూనియర్​ టెక్నికల్​ ఆఫీసర్​ పోస్టులకు నిర్వహించిన పరీక్షలకు రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. మొత్తం 837 పోస్టులకు ఈ నెల 5న పరీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే. ప్రశ్నాపత్రాల లీకుతో ఈ నిర్ణయం తీసుకున్నారు.