రైతులను అన్ని విధాలా ఆదుకుంటాం - మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి

రైతులను అన్ని విధాలా ఆదుకుంటాం - మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి

ముద్ర ప్రతినిధి, నిర్మల్: రైతు సంక్షేమమే ధ్యేయంగా తమ ప్రభుత్వం పని చేస్తోందని,అకాల వర్షాలకు తడిసిన ధాన్యాన్ని కొంటామని ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ ఇచ్చిన  నేపథ్యంలో అందుకు తగిన చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. గురువారం నిర్మల్ జిల్లా కేంద్రంలోని మార్కెట్ యార్డు లో మొక్క జొన్న కొనుగోలు కేంద్రాన్ని మంత్రి  అల్లోల కలెక్టర్ వరుణ్ రెడ్డి తో కలసి ప్రారంభించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అకాల వర్షాలకు తెలంగాణ వ్యాప్తంగా పంట నష్టం జరిగిందని, నిర్మల్ జిల్లాలో మాత్రం నష్టం తక్కువగానే జరిగిందని అన్నారు. తడిసిన ధాన్యం రేటు రూ.2100 నుండి తగ్గుతూ  రావడంతో ప్రభుత్వం మార్క్ ఫెడ్ ద్వారా క్వింటాల్ కి 1962 రూపాయల చొప్పున 14 శాతం తేమ ఉన్నప్పటికీ తీసుకుంటామన్నారు.

రైతులు అధైర్యపడవద్దన్నారు. కాగా వరికంటే మొక్కజొన్న పంట లాభసాటిగా ఉందని, మొక్కజొన్న కోళ్ల పరిశ్రమకి, బిస్కెట్ తయారీకి ఉపయోగకారిగా ఉంటుందని వివరించారు.  ఈ కార్యక్రమంలో  అడిషనల్ కలెక్టర్ రాంబాబు, జిల్లా రైతుబంధు సమితి అధ్యక్షుడు వెంకట్రాంరెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ చిలుక రమణ, ఎఫ్ఎస్ సిఎస్ చైర్మన్ ధర్మాజీ గారి రాజేందర్, ప్రజా ప్రతినిధులు తదితరులు ఉన్నారు.

జిల్లా అధికారుల భవనాలకు శంకుస్థాపన అంతకు ముందు మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి స్థానిక డిగ్రీ కళాశాల ఎదుట నూతనంగా నిర్మిస్తున్న జిల్లా అధికారుల భవన సముదాయానికి శంఖుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఈ సముదాయ నిర్మాణానికి రూ. 10 కోట్ల రూపాయలు వ్యయమవుతాయని, ఈ ఏడాది చివరినాటికి నిర్మాణాలు పూర్తయ్యేలా చూడాలని కాంట్రాక్టర్ ను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ వరుణ్ రెడ్డి,ఎస్పీ ప్రవీణ్ కుమార్,జడ్పి చైర్ పర్సన్ విజయలక్ష్మి, అడిషనల్ కలెక్టర్ రాంబాబు తదితరులు పాల్గొన్నారు.