సన్ సిటీ లో వైభవంగా శ్రీ లక్ష్మీనరసింహస్వామి కల్యాణోత్సవం

సన్ సిటీ లో వైభవంగా శ్రీ లక్ష్మీనరసింహస్వామి కల్యాణోత్సవం

హైదరాబాద్: శ్రీ లక్ష్మీ నరసింహ జయంతి సందర్భంగా సన్ సిటీ లోని శ్రీ  లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో గురువారంనాడు స్వామి వారి కళ్యాణ మహోత్సవం వైభవంగా జరిగింది. 514 ఏళ్ల కింద  వెలసిన ఈ ఆలయంలో ప్రతి ఏటా శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి కల్యాణోత్సవం నిర్వహిస్తారు. విశ్వశాంతి కోసం జరిగే కల్యాణోత్సవంలో వందలాది మంది పాల్గొన్నారు.