ఎన్టీఆర్ మిని స్టేడియం సమస్యలు తీర్చండి

ఎన్టీఆర్ మిని స్టేడియం సమస్యలు తీర్చండి

ముద్ర ప్రతినిధి, నిర్మల్: నిర్మల్ పట్టణంలోని ఎన్టీఆర్ మినీ స్టేడియం అన్యాక్రాంతం కాకుండా చూస్తూ, నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని నిర్మల్ మార్నింగ్ వాకర్స్ సభ్యులు మాజీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి కి విజ్ఞప్తి చేశారు. శనివారం తెల్లవారుజామున మహేశ్వర్ రెడ్డి, బిజెపి నేతలు పలువురు ఎన్టీఆర్ మినీ స్టేడియం లో సమస్యలను పరిశీలించారు. ఈ సందర్భంగా మార్నింగ్ వాకర్స్ తో మాట్లాడారు. పట్టణంలోని క్రీడాకారులకు, ఉదయం నడక, వ్యాయామం కోసం వచ్చే వారికి ఎంతో ఉపయోగ పడుతుందన్నారు. అయితే కొంత మంది దీన్ని ఆక్రమించుకునేందుకు ప్రయత్నిస్తున్నారని వారు వివరించారు. ఈ స్టేడియం లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని వారు మహేశ్వర్ రెడ్డి కి విజ్ఞప్తి చేశారు. దీనికి ఆయన సానుకూలంగా స్పందించారు. ఆయన వెంట బిజెపి నేతలు అయ్యన్నగారి భూమయ్య, అంజుకుమార్ రెడ్డి, రచ్చ మల్లేష్, ఒడిసెల అర్జున్ తదితరులున్నారు.