బిజెపి లో చేరిన పలువురు బి ఆర్ ఎస్ నేతలు

బిజెపి లో చేరిన పలువురు బి ఆర్ ఎస్ నేతలు

ముద్ర ప్రతినిధి, నిర్మల్:బిజెపి లోకి వివిధ మండలాలకు చెందిన నాయకులు చేరుతున్నారు.సారంగాపూర్ మండలం చించోలి (బి) గ్రామానికీ చెందిన అధికార పార్టీ సీనియర్ నాయకులు  అడెల్లి పోచమ్మ దేవాలయ డైరెక్టర్ బక్కన్న, ముఖ్య నాయకులు సాయన్న, చిన్న సాయన్న, రాజేందర్, బాలాజీ, సురేష్, దేవేందర్, సందీప్, భీమేష్, నరేష్, ప్రణయ్, సుశాంత్, సాయి వర్ధన్, బన్ని బక్కన్న, పోతన్న, గణేష్, లింగన్న, ఆకాష్, సాయి, నర్సయ్య, తరుణ్ తో పాటు పలువురు యువకులు బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి  సమక్షంలో భారతీయ జనతా పార్టీ లో చేరారు. దిలావర్ పూర్ మండలం గుండంపెల్లి గ్రామానికీ చెందిన నాయకపొడ్ సంఘం సభ్యులు మరియు వార్డ్ మెంబర్ తో పాటు పలువురు యువకులు తక్కల రమణా రెడ్డి ఆధ్వర్యంలో బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి సమక్షంలో భారతీయ జనతా పార్టీ లో చేరారు.