ప్రతిభ చాటేందుకే సీఎం కప్ పోటీలు మంత్రి అల్లోల

ప్రతిభ చాటేందుకే సీఎం కప్ పోటీలు మంత్రి అల్లోల

ముద్ర ప్రతినిధి, నిర్మల్:ప్రభుత్వం గ్రామీణ యువత ప్రతిభను వెలికి తీసేందుకు సీఎం కప్ పోటీలు నిర్వహిస్తోందని రాష్ట్ర మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. జిల్లా స్థాయి సీఎం కప్ పోటీలను  సోమవారం ఎన్టీఆర్ స్టేడియంలో  అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ  శాఖ  మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, కలెక్టర్ వరుణ్ రెడ్డి, ఎస్పీ ప్రవీణ్ కుమార్  లు ప్రారంభించారు.అనంతరం అల్లోల మాట్లాడుతూ జిల్లా స్థాయి పోటీలో పాల్గొంటున్న  క్రీడాకారులు   రాష్ట్ర స్థాయిలో పాల్గొని  జిల్లా పేరు నిలపాలని  అన్నారు.
ఈ కార్యక్రమంలో   అదనపు కలెక్టర్ రాంబాబు, డీ ఎస్పీ జీవన్ రెడ్డి,    క్రాంతి కుమార్,  మున్సిపల్ చైర్మన్  ఈశ్వర్, జిల్లా గ్రంధాలయ  చైర్మన్  రాజేశ్వర్,  ఎంపీపీ రామేశ్వర్, ఆర్డీఓ స్రవంతి తదితరులు పాల్గొన్నారు.