పెన్షనర్ల సమస్యలను పరిష్కరించండి

పెన్షనర్ల సమస్యలను పరిష్కరించండి

డిమాండ్ల సాధనకోసం ఉద్యమం
పెన్షనర్ల సంఘం రాష్ట్ర నేత ఎం సి లింగన్న

ముద్ర ప్రతినిధి, నిర్మల్: దశాబ్దాలుగా ప్రభుత్వంలో సేవలందించి పదవీ విరమణ అనంతరం సమస్యలు ఎదుర్కొంటున్న పెన్షనర్ల ఇబ్బందులను తీర్చాలని  పెన్షనర్ల సంఘం రాష్ట్ర బాధ్యులు ఎం సి లింగన్న డిమాండ్ చేశారు. రాష్ట్ర శాఖ పిలుపు మేరకు సోమవారం స్థానిక కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ సర్వీసు కాలంలో ఎందరి సమస్యలో పరిష్కరించామని, తమ సమస్యలు అపరిష్కృతంగా ఉంటున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి నెల పెన్షన్ ఆలస్యం అవుతోందని, దీనిని దృష్టిలో ఉంచుకొని ఒకటో తేదీనే పెన్షన్ అందించాలని కోరారు.

అలాగే అదనపు ఆదాయమేది లేనందున పెన్షనర్లను ఆదాయం పన్ను చెల్లింపు నుంచి మినహాయింపు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆర్టీసి బస్సులో ప్రయాణానికి 50 శాతం రాయితీ కల్పించాలని కోరారు. చాలా ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న పీఆర్సీ విషయంలో కూడా వెంటనే కమిటీ ఏర్పాటు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు అయ్యన్న గారి భూమయ్య, రావుల రాంనాథ్ లు పాల్గొని సంఘీభావం ప్రకటించారు.