వర్షాల కోసం  అగ్రి ఉద్యోగుల కప్పతల్లి ఊరేగింపు

వర్షాల కోసం  అగ్రి ఉద్యోగుల కప్పతల్లి ఊరేగింపు

ముద్ర ప్రతినిధి, నిర్మల్: వర్షాకాలం ప్రారంభమై  పక్షం రోజులు కావస్తున్నా చుక్క నీరు కురియక రైతాంగం ఇబ్బందులు పడుతున్నారు. సీజన్ ఆలస్యం అవుతుందని ఆందోళన చెందుతున్న రైతాంగానికి తోచని పరిస్థితి. ఈ పరిస్థితుల్లో తాము చేసేదేమీ లేక భగవంతునిపై భారం వేశారు. పూర్వీకులు అనుసరిస్తున్న ఆచారం

" కప్పతల్లి " ని పాటిస్తేనైనా వర్షాలు పడతాయని నమ్ముతారు. నిర్మల్ జిల్లా అగ్రి ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో నిర్మల్ లో గురువారం కప్పతల్లి కార్యక్రమం నిర్వహించారు. కప్పను ఒక గుడ్డలో కర్రకు కట్టి దానిపై నీళ్ళు పోస్తూ జాతీయ రహదారిపై  ఊరేగించారు.