బిజెపిలోకి భారీగా యువకుల చేరిక

బిజెపిలోకి భారీగా యువకుల చేరిక

ముద్ర ప్రతినిధి, నిర్మల్:నిర్మల్ నియోజకవర్గం లక్ష్మణ చంద మండలం చామన్ పల్లి, యువశక్తి యూత్, జై శ్రీరామ్ యూత్,శ్రీరామ్ సేన యూత్, పవర్ యూత్ సభ్యులు భారీగా బిజెపి లో చేరారు. వీరితో పాటు బీ ఆర్ ఎస్ పార్టీ నాయకులు మల్లయ్య,శంకర్, రమణ, వెంకటి, భూమేష్, ప్రగత్, గంగయ్య తో పాటు సుమారు 150 మంది కి పైగా బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి సమక్షంలో భారతీయ జనతా పార్టీలో చేరారు ఈ కార్యక్రమంలో నాయకులు అంజుకుమార్ రెడ్డి,  భూపాల్ రెడ్డి, ఎంపీపీ పద్మ రమేష్, నూతుల  భూపతి రెడ్డి, వెంకట్ రెడ్డి, ముత్యం రెడ్డి, శ్రీనివాస్, మల్లేష్, బడగారి మల్లేష్, మహిపాల్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు.