ఎరువుల డీలర్ల శిక్షణా తరగతులు సద్వినియోగం చేసుకోవాలి - కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్

ఎరువుల డీలర్ల శిక్షణా తరగతులు సద్వినియోగం చేసుకోవాలి  - కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్

ముద్ర, ప్రతినిధి, నిర్మల్:ఎరువులు, పురుగు మందులు అమ్మే డీలర్లకు 48 ఆదివారాలు శిక్షణా తరగతులు నిర్వహిస్తు న్నామని, ఇందులో భాగ స్వాములు కావాలని కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. ఎరువులు, విత్తనాలు, పురుగు మందుల విక్రయదారులకు 48 వారాల పాటు ప్రతి ఆదివారం నిర్వహించబోయే శిక్షణ కార్యక్రమానికి సంబంధించి అవగాహన సదస్సులో  కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్  శుక్రవారం  పాల్గొన్నారు. స్థానిక మార్కెట్ యార్డ్ ఆవరణ లోని రైతు వేదికలో   జిల్లా వ్యవసాయాధికారి అంజి ప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన గావించారు.ఈ కార్యక్రమంలో  మాట్లాడుతూ డీలర్లు డిప్లొమా కోర్సు పూర్తి అయిన తరువాత విత్తన విక్రయానికి అర్హత పొందుతారని తెలిపారు. డీలర్లు ఈ శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.ఈ కార్య క్రమంలో డీలర్లు,వ్యవసాయ అధికారులు పాల్గొన్నారు.