ఎక్కడికక్కడ అరెస్టులు, బిజెపి నిరసనలు - భైంసా లో సీఎం దిష్టి బొమ్మ దహనం

ఎక్కడికక్కడ అరెస్టులు, బిజెపి నిరసనలు - భైంసా లో సీఎం దిష్టి బొమ్మ దహనం

ముద్ర ప్రతినిధి, నిర్మల్: బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్ట్ కు నిరసనగా ఒక పక్క బిజెపి శ్రేణులు కార్యక్రమాలు నిర్వహిస్తుంటే, మరో పక్క పోలీసులు ఆ పార్టీ నేతలను ఎక్కడికక్కడ హౌజ్ అరెస్టులు, అరెస్టులు చేస్తున్నారు. నిర్మల్, భైంసా ల్లో బుధవారం తెల్లవారు జాము నుంచే అరెస్టుల పర్వం కొనసాగుతోంది.భైంసా లో బిజెపి నేత రామారావు పటేల్ ను గృహ నిర్బంధం లో ఉంచారు. అలాగే పలువురు ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలను కూడా అదుపులోకి తీసుకున్నారు. భైంసా లో కెసిఆర్ దిష్టి బొమ్మ దహనం ఇదిలా ఉండగా భైంసా లో కార్యకర్తలు బండి సంజయ్ అరెస్ట్ కు నిరసనగా కెసిఆర్ దిష్టి బొమ్మ దహనం చేశారు. లీకేజీలను అరికట్టడంలో వైఫల్యాలను దాచుకొనేందుకే ఈ అరెస్టులు అని ఆరోపించారు.