ఐసీఏఆర్​– ఐఐఎంఆర్​ ఆధ్వర్యంలో లులులో మిల్లెట్​ ఉత్సవ్​

ఐసీఏఆర్​– ఐఐఎంఆర్​ ఆధ్వర్యంలో లులులో మిల్లెట్​ ఉత్సవ్​
  • తృణధాన్యాలతో ఆరోగ్య ప్రయోజనాలు మెండు
  • ఐసీఏఆర్​–ఐఐఎంఆర్​ డైరెక్టర్​ తారా సత్యవతి
  • డిసెంబర్​  17 వరకు కొనసాగనున్న ఉత్సవ్​

హైదరాబాద్: వంద రకాల మిల్లెట్​లలో (తృణధాన్యాలు) 76 రకాల ప్రీమియం బ్రాండ్​లతో అత్యద్భుతమైన ఆఫర్​లతో అంతర్జాతీయ మిల్లెట్స్​ –2023(ఉత్సవ్​) ఫెస్ట్​ను లులు  నిర్వహించింది. లులుమాల్​లో జరిగిన అంతర్జాతీయ మిల్లెట్స్​ సంవత్సరంగా ప్రకటించిన సందర్భంగా ఐసీఏఆర్​–ఐఐఎంఆర్​ డైరెక్టర్​ తారా సత్యవతి పాల్గొని మిల్లెట్లతో కలిగే ప్రయోజనాలను వివరించారు. ఈ ఫెస్ట్​ డిసెంబర్​ 17వరకు కొనసాగనుంది. ముఖ్యంగా మధుమేహ వ్యాధిగ్రస్తులకు మిల్లెట్స్​ వల్ల అనేక ప్రయోజనాలున్నాయన్నారు. మనం నిత్యం తీసుకునే ఆహారంలో మిల్లెట్లను భాగం చేసుకోవడంతో అధిక మొత్తంలో ప్రోటీన్లు, మినరల్స్​ను పొందుతామన్నారు. అదే సమయంలో ఆరోగ్యంగా ఉంటామన్నారు. మిల్లెట్​ ఇయర్​ను లులుమాల్​ నిర్వహించడం అభినందనీయమన్నారు. ఐసీఎఆర్​, ఐఐఎంఆర్​, న్యూట్రీ హబ్​, ఐఐహెచ్​ఎంల సహకారంతో ఈ వేడుకను నిర్వహిస్తున్నారు. 

ఈ ఫెస్ట్​లో సాంప్రదాయ, రుచికరమైన, తీపి మిల్లెట్​ వంటకాలతో రకరకాల వంటకాలను రుచి చూపించారు. ఫెస్ట్​లో భాగంగా రోజూ పలురకాల మిల్లెట్​ స్పెషల్​ వంటకాలను సిద్ధం చేస్తున్నారు. లులులో మిల్లెట్​లతో చేయబడిన బేకరీ ఉత్పత్తులు కూడా నాణ్యమైన, సరసమైన ధరలకే అందుబాటులో ఉన్నాయి.

వంటకాలను ఆరగించడం, ఉత్పత్తులను కొనుగోలు చేసేందుకు లులు మిల్లెట్​ స్టార్​–యాప్​ కియోస్క్​ను కూడా ఏర్పాటు చేసింది. మిల్లెట్​ ఉత్సవాలను దృష్టిలో పెట్టుకొని ఆరోగ్యకరమైన, రుచికరమైన వంటకాలకు, మిల్లెట్ల కొనుగోళ్లకు లులును సందర్శించాలని సంస్థ నిర్వాహకులు పేర్కొన్నారు. ఈ వేడుకలో ప్రముఖ సంస్థలు పాల్గొనడం తమ సంస్థకు మాత్రమే దక్కిన అరుదైన అవకాశంగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు.