సూర్యాపేట లో కదం తొక్కిన గ్రామీణ తపాల ఉద్యోగులు

సూర్యాపేట లో కదం తొక్కిన గ్రామీణ తపాల ఉద్యోగులు
  • పోస్టల్ ఎస్పి కి వ్యతిరేకంగా నినాదాలు చేసిన గ్రామిణ తపాల ఉద్యోగులు

ముద్ర ప్రతినిధి సూర్యాపేట:-తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గ్రామీణ తపాల ఉద్యోగ సంఘాలు ఎఐ జిడిఎస్ యు, ఎన్ యు జిడిఎస్ యు, ఎన్ ఎఫ్ పిఇ జిడిఎస్ ఆధ్వర్యంలో  జిడిఎస్  ఉద్యోగులు  సూర్యాపేట  పట్టణంలో హెడ్ పోస్టాఫీసు నుండి  కొత్త బస్టాండు వరకు తిరిగి తపాల శాఖ ఎస్పి కార్యాలయం వరకు    నిరసన ప్రదర్శన శుక్రవారం నిర్వహించారు.

హెడ్ పోస్టాఫీసు వద్ద, ఎస్పి కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేశారు.  సూర్యాపేట తపాల శాఖ ఎస్పి,, పోస్టల్ ఇన్‌స్పెక్టర్ కి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గ్రామీణ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, గ్రూప్ ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని , సమ్మెలో పాల్గొన్న వారిని విధుల నుంచి తొలగించడానికి నిరసనగా ఉత్తర్వుల కాపీలను తగులబెట్టారు.  ఈ కార్యక్రమంలో ఉద్యోగ సంఘాల నాయకులు నాగరాజు, రవి, మదన్, లింగయ్య, సంజీవ, మిధున్,వెంకటాచారి, పుల్లయ్య, నజీర్ , క్రాంతి, తిరుపతయ్య, అఖిల, దివ్య, మేరి, రమ్యశ్రీ, చేతన నేషిన్ తదితరులు పాల్గొన్నారు.