వ్యర్థాల రీసైకిల్ తో పర్యావరణ రక్షణ

వ్యర్థాల రీసైకిల్ తో పర్యావరణ రక్షణ

ముద్ర ప్రతినిధి, నిర్మల్:ప్లాస్టిక్, పేపర్ వ్యర్థాలను రీ సైకిల్ చేయటం ద్వారా పర్యావరణం పై ఒత్తిడి తగ్గించవచ్చని సిఇఇ - ఈ శ్రీ గ్రీన్ స్వచ్ఛంద సంస్థ కో ఆర్డినేటర్ శరత్ చంద్ర అన్నారు. స్థానిక చాణక్య ఉన్నత పాఠశాలలో వ్యర్థాల నియంత్రణ, నిర్వహణ పై జరిగిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. ప్లాస్టిక్, పేపర్ వ్యర్థాలను పునర్వినియోగం లోకి తేవాల్సిన అవసరం ఉందన్నారు. ఇందుకోసం తమ సంస్థ వ్యర్థాలను సేకరిస్తూ వాటిని తిరిగి వినియోగం చేసేందుకు అవసరమైన చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సంస్థ ఎం ఆర్ ఎఫ్ మంజుష, ప్రిన్సిపాల్ హరీష్, విద్యార్థులు పాల్గొన్నారు.