సిలిండర్ ధరల పెంపునకు నిరసనగా ధర్నా

సిలిండర్ ధరల పెంపునకు నిరసనగా ధర్నా

ముద్ర ప్రతినిధి, నిర్మల్: గృహ, వాణిజ్య సిలిండర్ల ధరలను పెంచడాన్ని నిరసిస్తూ బి ఆర్ ఎస్ ఆధ్వర్యంలో గురువారం నిర్మల్ లో ధర్నా నిర్వహించారు. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ శ్రేణులు, కార్యకర్తలు మహిళలు పెద్ద ఎత్తున గుమిగూడారు. స్థానిక ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం నుంచి మయూరి జంక్షన్ వరకు ఊరేగింపు నిర్వహించి అక్కడ రోడ్డుపై రాస్తారోకో నిర్వహించారు. సిలిండర్ల ధరల పెంపు వల్ల సామాన్యులపై మోయలేని భారం పడుతుందని వారన్నారు.