‘శాట్స్‌’ సహకారంతోనే క్రీడల్లో అద్భుతమైన విజయాలు

‘శాట్స్‌’ సహకారంతోనే క్రీడల్లో అద్భుతమైన విజయాలు
Telangana State Sports Authority
  • చెస్‌ క్రీడకు ఎంతో ప్రోత్సాహం
  • శాట్స్‌ ఛైర్మన్‌ డాక్టర్‌ ఆంజనేయ గౌడ్‌
  • జాతీయ చెస్‌ విజేతలను సన్మానించిన శాట్స్‌ ఛైర్మన్‌

 తెలంగాణ రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ (శాట్స్‌) ఇస్తోన్న సహకారంతో తెలంగాణ   క్రీడాకారులు అద్భుతమైన ఫలితాలు సాధిస్తున్నారని ‘శాట్స్‌’ ఛైర్మన్‌ డాక్టర్‌ ఆంజనేయ గౌడ్‌ అన్నారు.  ఇటీవల తమిళనాడు పోలాచ్చిలో జరిగిన జాతీయ మహిళా చెస్‌ ఛాంపియన్‌షిప్‌`2023లో విజయం సాధించిన చెస్‌ క్రీడాకారిణులను ఆయన గురువారం  తన ఛాంబర్‌లో సన్మానించారు. ఈ టోర్నమెంట్‌లో తెలంగాణ రాష్ట్ర మహిళ చెస్‌ టీం కీర్తి గంటా (కెప్టెన్‌), సరయు నటూరా బెటి, స్నేహభారతి, యశ్వీజైన్‌, శిరీష (మెనేజర్‌) (బోర్డ్‌ నెం. 1, బోర్డ్‌ నెం. 3, బోర్డ్‌ నెం. 5)లో మూడు కాంస్య పతకాలు సాధించి, ఓవరాల్‌గా నాలుగవ స్థానం సంపాదించారు.

ఈ సందర్భంగా శాట్స్‌ ఛైర్మన్‌ డాక్టర్‌ ఆంజనేయ గౌడ్‌ మాట్లాడుతూ,Telangana State Sports Authority తెలంగాణ రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ (శాట్స్‌) సహకారం ఇస్తోన్న ప్రోత్సహంతో మన క్రీడాకారులు అద్భుతమైన ఫలితాలు సాధించడం సంతోషకరమని అన్నారు. తెలంగాణ మహిళ చెస్‌ టీమ్‌ తన సీడిరగ్‌కు మించి ప్రతిభ కనబర్చి, మూడు కాంస్య పతకాలు సాధించినందుకు  అభినందనలు తెలియజేసారు. చెస్‌ క్రీడకు మహిళలను చెస్‌లో ప్రోత్సహించడం కోసం ‘శాట్స్‌’ ఆధ్వర్యంలో ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా కేసీఆర్‌ ఛాంపియన్‌షిప్‌ పేరిట తెలంగాణ రాష్ట్ర మహిళా  చెస్‌ ఛాంపియన్‌షిప్‌ను దిగ్విజయంగా నిర్వహించి చెస్‌ క్రీడకు ఎంతో ప్రోత్సాహం ఇచ్చామని ఆయన తెలియజేసారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ చెస్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు కె.ఎస్‌. ప్రసాద్‌, కోశాధికారి రవీంద్ర, క్రీడాకారుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.