25 లక్షల డబ్బు పట్టివేత
ముద్ర, తూప్రాన్:ఎన్నికల నియమావలికి విరుద్ధంగా సరైన పత్రాలు లేకుండా తరలిస్తున్న 25 లక్షల భారీ మొత్తంలో డబ్బును మనోహరాబాద్ పోలీసులు పట్టుకున్నారు. ఎస్ఐ కర్ణాకర్ రెడ్డి కథనం ప్రకారం సిరిసిల్ల జిల్లా గంబీరావుపేటకు చెందిన కలకుంట్ల నరేందర్ హైదరాబాద్ నుండి ఆర్టీసీ బస్ లో కామారెడ్డి వైపు వెళ్తుండగా మనోహరాబాద్ మండలం కాళ్లకల్ పోలీసు చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీ నిర్వహించగా ఎలాంటి సరైన పత్రాలు లేకుండా 25 లక్షలు రూపాయలు డబ్బు కలిగి ఉండడంతో వాటిని స్వాధీనం చేసుకున్నారు. సిజ్ చేసి గజ్వెల్ కు తరలించినట్లు ఎస్ఐ తెలిపారు. సరైన పత్రాలు లేకుండా 50వేలకు మించి ఎవరూ కలిగి ఉన్నా సిజ్ చేయడం జరుగుతుందని ఎస్ఐ కర్ణాకర్ రెడ్డి తెలిపారు.