నిర్మల్ లో క్లీనప్ డ్రైవ్

నిర్మల్ లో క్లీనప్ డ్రైవ్

ముద్ర ప్రతినిధి, నిర్మల్: చరిత్రకు ఆనవాలుగా ఉన్న శ్యాం గడ్ సమీపంలో సి ఈ ఈ ఆధ్వర్యంలో ఈ గ్రీన్ వర్క్స్ లో భాగంగా ఆదివారం నేషనల్ క్లీనప్ డ్రైవ్ నిర్వహించారు. ఈ మేరకు కోట పరిసరాల్లో ఉన్న చెత్త చెదారాలను మునిసిపాలిటీ సహకారంతో శుభ్రపరిచారు. ఈ కార్యక్రమంలో వక్తలు మాట్లాడుతూ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో మునిసిపల్ ఈ ఈ అజారుద్దీన్, సానిటరీ ఇన్స్పెక్టర్ దేవిదాస్, కిఫాయత్ ఖాన్, శరత్ చంద్ర, మంజూష తదితరులు పాల్గొన్నారు.