కార్మికుల ప్రాణాలు తీసి విలీనమా?

కార్మికుల ప్రాణాలు తీసి విలీనమా?
  • ఆస్తుల ఆక్రమణకే విలీనం ఎత్తుగడ
  • బిజెపి పెద్దపల్లి ఇంఛార్జి రావుల రాం నాథ్

ముద్ర ప్రతినిధి, నిర్మల్:గతంలో ఆర్టీసి సమ్మె సమయంలో 33 మంది కార్మికులను పొట్టన పెట్టుకున్న కెసిఆర్ నేడు ఆర్టీసి విలీనం చేయటం కేవలం ఆర్టీసి ఆస్తులను కొల్లగొట్టేందుకేనని బిజెపి పెద్దపల్లి ఇంఛార్జి రావుల రాం నాథ్ విమర్శించారు. బిజెపి కార్యాలయంలో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ ప్రజలను మళ్లీ మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు.  గతంలో ఆర్టీసీ కార్మికులు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయమని అడిగితే వాళ్లను పక్కనపెట్టిన కారణంగా 33 మంది కార్మికుల ఆత్మహత్య, వి ఆర్ ఎస్ ఇప్పించి పంపించిన ఘనత కెసిఆర్ దే నన్నారు.ఇప్పుడు ప్రభుత్వంలో విలీనం ప్రకటన చేయటం ఆర్టీసీ ఆస్తుల మీద కన్నేసిన ఫలితమేనన్నారు.వాటిని అమ్మే ప్రయత్నంలో భాగమేనని అన్నారు. ఈ సమావేశంలో బిజెపి నాయకులు అయ్యన్న గారి రాజేందర్, తోట సత్యనారాయణ, రచ్చ మల్లేష్, బాబా తదితరులు పాల్గొన్నారు.