బిఆర్ఎస్ పథకాలు దేశానికి దిక్సూచి - మెదక్ ఎమ్మెల్యే పద్మ

బిఆర్ఎస్ పథకాలు దేశానికి దిక్సూచి - మెదక్ ఎమ్మెల్యే పద్మ

ముద్ర ప్రతినిధి, మెదక్:బిఆర్ఎస్ సంక్షేమ పథకాలు దేశానికి దిక్సూచి అయ్యాయని ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మెదక్ జిల్లా పాపన్నపేట మండలం  తమ్మాయిపల్లి, అరికెల నార్సింగి, సీతానగర్, బాచారం, ఎంకేపల్లి, చిత్రియాల్, గాజుల గూడెం, కొడుపాక గ్రామాలలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి ఇంటింటికి వెళ్లి తనకు ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను విజ్ఞప్తి చేశారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ...

బిఆ ఎస్ అంటేనే సంక్షేమం అన్నారు. నియోజకవర్గ ప్రజలందరూ ఆశీర్వదించి అధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు.మైనంపల్లి హనుమంత్ రావు కొట్లాటలు పెట్టడం మల్కాజ్ గిరిలో నడుస్తది కానీ మెదక్ నియోజకవర్గంలో కుదరదన్నారు. నియోజకవర్గంలో ప్రశాంతంగా ఎన్నికలు జరగాలని కోరుకుంటున్నట్లు చెప్పారు.మేము వచ్చి గొడవలు పెడతాం, కోట్లాటలు పెడతాం అంటే ఊరుకోమని హెచ్చరించారు.మెదక్ అభివృద్ధి పరంపర కొనసాగాలంటే బిఆర్ఎస్ గెలవాలి, కెసిఆర్ సీఎం కావాల్సిన అవసరం ఉందన్నారు.తమ్మాయిపల్లి గ్రామంలో గొర్లు పంపిణీ, డబల్ బెడ్ రూమ్ ఇల్లు రాలేవని  ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి మాట్లాడే సమయంలో కొంత మంది కాంగ్రెస్ కార్యకర్తలు  అడగడంతో అన్నిoటినీ పరిష్కరిస్తామని ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి సమాదానం చెప్పారు. ఈ ప్రచారంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మంగళహారతులతో మహిళలు ఘనంగా స్వాగతం పలికారు.