క్రీడలతో ఆరోగ్యం  ఉల్లాసం

క్రీడలతో ఆరోగ్యం  ఉల్లాసం

అడిషనల్ కలెక్టర్ ప్రతిమా సింగ్
ముద్ర ప్రతినిధి, మెదక్: క్రీడలతో శారీరక దృడత్వంతో పాటు  మానసిక ఉల్లాసానికి ఎంతో దోహదపడతాయని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రతిమ సింగ్ అన్నారు. సోమవారం స్థానిక బాలుర జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన సి.యం. కప్-2023 క్రీడా పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ యువత క్రీడలను తమ దినచర్యలో భాగం చేసుకోవాలని,  తద్వారా శారీరకంగా ఆరోగ్యంగా ఉండడంతో పాటు ఎంతో  ఉల్లాసవంతంగా తదుపరి దినచర్యలలో చురుకుగా భాగస్వాములు కావచ్చని  అన్నారు.

మూడు రోజుల పాటు ఆరు అంశాలలో మండల స్థాయిలో నిర్వహించే వివిధ క్రీడలలో పాల్గొని గెలుపొందిన విజేతలకు జిల్లా స్థాయిలో ఈ నెల 22 నుండి 24 వరకు క్రీడలు నిర్వహించనున్నామన్నారు. యువత మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిలో రాణించాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా వాలి బాల్ సర్వీస్ చేసి క్రీడలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డివిజనల్ పంచాయతీ అధికారి రాజేంద్ర ప్రసాద్, మున్సిపల్ కమీషనర్ జానకిరామ్ సాగర్, ఎంపిడిఓ శ్రీరాం, పీఈటీలు తదితరులు పాల్గొన్నారు. 5 జట్లు పాల్గొనగా పేరూరు జట్టు విజేతగా నిలిచింది.