రెండో రోజు బ్రహ్మచారిణీ గా బాసర అమ్మవారు

రెండో రోజు బ్రహ్మచారిణీ గా బాసర అమ్మవారు

బాసర, ముద్ర:-నవరాత్రి ఉత్సవాలో భాగంగా సోమవారం రెండో రోజు బాసర సరస్వతీ అమ్మవారు బ్రహ్మ చారిణీ రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. గురువు వద్ద బ్రహ్మచర్య ఆశ్రమంలో  తోటి విద్యార్థినులతో ఉండే అవతారం గా భావిస్తారు.. సోమవారం ఉదయం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి పులిహోర ను నైవేద్యంగా సమర్పించారు. భక్తులు అధిక సంఖ్యలో అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయం వద్ద నాందేడ్ కు చెందిన జగదీష్ మహారాజ్  భక్తులకు అన్నదానం నిర్వహిస్తున్నారు. అలాగే ధర్మాబాద్ కు చెందిన వ్యాపారస్తులు , బాసర గ్రామానికి చెందిన నర్సురీ నరేష్ రావు వచ్చే భక్తులకు ప్రసాదం పంపిణీ చేస్తున్నారు.