వరి ధాన్యం కొనుగోలులో రైతులకు ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకోవాలని - కలెక్టర్ పి. ఉదయ్  కుమార్

వరి ధాన్యం కొనుగోలులో రైతులకు ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకోవాలని - కలెక్టర్ పి. ఉదయ్  కుమార్

ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్:  తెలకపల్లి పి.ఏ.సి.ఎస్ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని, మార్కెట్ యార్డును పరిశీలించారు.  అకాల వర్షం వల్ల ఇప్పటికే రైతులు ఇబ్బందులు పడుతున్నారని, తేమ విషయంలో కొంచెం అటు ఇటు అయిన రైతును ఇబ్బంది పెట్టకుండ కొనుగోలు చేయాలని సూచించారు. తాలు విషయంలో సైతం నిబంధనల మేరకు మాత్రమే తరుగు తీయాలని,  క్విటాలుకు 4 నుంచి 5 కిలోల తరుగు తీయవద్దన్నారు.  రైతులకు కొనుగోలు కేంద్రానికి ధాన్యం తెచ్చే రైతులకు అవసరమైన టార్పాలిన్ లు అందజేయాలని సూచించారు.  సేకరించిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు మిల్లర్లకు పంపించే విధంగా చూసుకోవాలన్నారు.    

రైతులతో మాట్లాడిన కలెక్టర్ సమస్యలు ఎమున్నాయని అడిగి తెలుసుకున్నారు. ధాన్యం తెచ్చిన  రైతులు చిన్నయ్య, ఈశ్వర్ మాట్లాడుతూ ఈసారి వెన్నపూస తెగులు వచ్చి పంట దిగుబడి తగ్గిందన్నారు.  అదేవిధంగా తెచ్చిన ధాన్యం ఉదయం ఆరబెట్టినా సాయంత్రానికి అకాల వర్షం వచ్చి ధాన్యం తడిచిపోతుందని ఆవేదన వ్యక్తం  చేశారు.  తేమ శాతం కొంచెం పెరిగిన తీసుకునే విధంగా అదేశాలివ్వాలని కోరారు.  రాత్రిపూట ధాన్యం కుప్పలకు పందుల దాడి తప్పడం లేదని ఆరుగాలం కష్టపడి పండించిన పంటను అమ్ముకునే విధంగా సహకరించాలని కోరారు. స్పందించిన కలెక్టర్ రైతులకు ఇబ్బందులు కలుగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. జిల్లా  సివిల్ సప్లై అధికారి మోహన్ బాబు, డి.యం. బాల్ రాజ్, తహసిల్దార్ తబితా, పిపిసి ఇంచార్జ్ లు, రైతులు తదితరులు కలెక్టర్ వెంట ఉన్నారు.