టిక్కెట్టు నాదే.. గెలుపు నాదే... ఎమ్మెల్యే రాజయ్య వెల్లడి

టిక్కెట్టు నాదే.. గెలుపు నాదే... ఎమ్మెల్యే రాజయ్య వెల్లడి

స్టేషన్ ఘన్ పూర్, ముద్ర: మరో ఆరు నెలల్లో ఎన్నికలు వస్తాయని వచ్చే ఎన్నికల్లో టిక్కెట్టు నాదే.. గెలుపు నాదేనని స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ టి. రాజయ్య స్పష్టం చేశారు. జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గ కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో గురువారం మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ మధ్యకాలంలో ప్రచారం మాధ్యమాల్లో అభ్యర్థి మారుతాడని వస్తున్న ప్రచారం తప్పన్నారు. వచ్చే ఎన్నికల్లో టిక్కెట్టు నాదే.. గెలుపు నాదేనని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు పార్టీ బలోపేతానికి ఆత్మీయ సమావేశాలు ఏర్పాటు చేస్తూ అందరిని కలుపుకుపోయేందుకు కృషి చేస్తున్నా అన్నారు. అధినేత ఆదేశాన్ని అమలు చేస్తున్న, నిత్యం ప్రజల మధ్య ఉంటున్న నా త్యాగం, నా విధేయత వృధా కాదని ముఖ్యమంత్రి కేసీఆర్ గుర్తిస్తారని ఆయన ఆదేశాలే నాకు శిరోధార్యం అన్నారు. కార్యకర్తలు గందరగోళ పడవద్దు అని పనిచేస్తూ పోతే గుర్తింపు అదే వస్తుంది అన్నారు. వచ్చే ఎన్నికల్లో దళిత బంధు, గృహలక్ష్మి పథకాలు ఎన్నికల హస్త్రాలుగా ప్రజల్లోకి తీసుకెళ్తామన్నారు. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ దేశ ప్రజల సంక్షేమం కోసం బిఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేశారన్నారు. రేపు హనుమకొండలో జరగనున్న బిఆర్ఎస్ పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవం, సాయంత్రం జరిగే బహిరంగ సభకు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వస్తున్నాడని ఈ సభను విజయవంతం చేసేందుకు నియోజకవర్గము నుంచి 2000 మంది తరలిరావాలన్నారు. ఆత్మీయ సమ్మేళనాలు ఈనెల 31వ తేదీ వరకు నిర్వహించుకోవచ్చు అన్న కేటీఆర్ ఆదేశాలకు ఆరు మండలాల్లో జరగాల్సి ఉన్న రెండో విడత సమ్మేళనాలను చేసేందుకు పార్టీ శ్రేణులు కృషి చేయాలి అన్నారు.12న కళ్లెం,16 ఖిల షాపూర్, 22న మీదికొండ, 26న మల్కాపూర్, 31న జరిగే రెండో క్లస్టర్ మీటింగ్లను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో మార్కెట్ కమిటీ చైర్మన్ గుజ్జరి రాజు, జఫర్గడ్ జడ్పిటిసి బేబీ శ్రీనివాస్, ఎంపీపీ సుదర్శన్, నాయకులు ఆకుల కుమార్, మనోజ్ రెడ్డి, పోలేపల్లి రంజిత్ రెడ్డి, కనకయ్య, గడ్డం రాజు, భాగ్యలక్ష్మి, నాగరబోయిన శ్రీరాములు, జైపాల్ రెడ్డి, మాచర్ల గణేష్, భూక్య రమేష్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.