చిన్న పెండ్యాల లో రాస్తారోకో ..

చిన్న పెండ్యాల లో రాస్తారోకో ..

రేవంత్ దిష్టిబొమ్మ దహనం

ముద్ర, స్టేషన్ ఘన్ పూర్: రాష్ట్రంలో వ్యవసాయ రంగానికి 3 గంటల కరెంటు సరిపోతుందని టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి తానా సభలలో చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ జనగామ జిల్లా చిన్న పెండ్యాలలో మంగళవారం అధికార పార్టీ నాయకులు జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించి టి పి సి సి చీఫ్ రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా జిల్లా పరిషత్ చైర్మన్ పాగాల సంపత్ రెడ్డి మాట్లాడుతూ ఒక తొమ్మిదేళ్లుగా రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు నిరంతరం కృషి చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవసాయ రంగానికి పెద్ద పీట వేశారన్నారు.

టిఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ఎద్దేవచేసిన టిసిసిపి చీఫ్ ఆయన చేసిన అనుచిత వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు రమేష్ నాయక్, సర్పంచ్ లింగారెడ్డి, ఎంపీటీసీ ఉమా సమ్మయ్య, నియోజకవర్గ కోఆర్డినేటర్ పోలపల్లి రంజిత్ రెడ్డి, జనగాం యాదగిరి, తీగల మహేందర్, వెన్నం మాధవరెడ్డి, కంకట రవీందర్, నీల రాజు తదితరులు పాల్గొన్నారు. జాతీయ రహదారిపై అధికార పక్షం నేతలు రాస్తారో చేస్తున్న విషయాన్ని తెలుసుకున్న స్థానిక ఎస్సై వినయ్ కుమార్ అక్కడికి చేరుకొని ఆందోళనను విరమింపజేసి రాకపోకలను క్రమబద్దీకరించారు.