దారి దోపిడీ ముట సభ్యుల అరెస్ట్.

దారి దోపిడీ ముట సభ్యుల అరెస్ట్.
  • రెండు పెప్పర్ స్ప్రేలు బాటిల్లు, మూడు సెల్ ఫోన్లు స్వాధీనo.
      
  • నిందితుల వివరాలు వెల్లడించిన ఎస్పీ ఎగ్గడి భాస్కర్ 

ముద్ర ప్రతినిధి, జగిత్యాల: జగిత్యాల జిల్లాలో గత కొంతకాలంగా ఒంటరిగా ప్రయాణిస్తున్న మహిళలను లక్ష్యంగా చేసుకొని వారి కళ్ళల్లో పెప్పర్ స్ప్రే  కొట్టి వారి మెడలో నుంచి బంగారు చైన్లు, ఒంటిపై విలువైన వస్తువులను  దొంగిలించే దారిదోపిడి ముఠాలోని ముగ్గురు దొంగలు అరెస్టు చేసినట్లు జిల్లా ఎస్పీ ఎగ్గడి భాస్కర్ తెలిపారు. జిల్లా ఎస్పి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ వివరాలు వెల్లడించారు. మెట్ పల్లి  బస్టాండ్ ప్రాంతంలో గురవారం సాయంత్రం అనుమానాస్పదంగా తిరుగుతున్న ముగ్గురిని  మెట్ పల్లి సి.ఐ లక్ష్మీనారాయణ  అదుపులోకి తీసుకొని విచారించగా ఏడాది క్రితం ఉత్తరప్రదేశ్ రాష్ట్రం నుండి కోరుట్ల మండలం వెంకటాపూర్ గ్రామానికి వచ్చి ప్రకాష్, దరోగా, అభిషేక్ రాజ్ పుత్  ఐస్ క్రీం లు అమ్ముతుండేవారని, వచ్చిన డబ్బులతో జల్సాలకు అలవాటుపడి డబ్బులు సరిపోక దొంగతనాలు, దోపిడీ చేయాలని నిర్ణయించుకుని అక్టోబర్30, 2022న ముగ్గురు మహిళలు మెట్ పల్లి పాత బస్టాండ్ నుండి కోరుట్ల వైపు ఆటోలో  వెళ్తుండగా ప్రకాష్, దరోగా, అభిషేక్ రాజ్ పుత్ లు అదే ఆటోలో ఎక్కి  మారుతి నగర్ వద్ద ఆటోను ఆపి నిందితులు ముగ్గురు మహిళలు, ఆటో డ్రైవర్ పై పెప్పర్ స్ప్రే చేసి ఒక మహిళ మెడలో నుంచి మూడు తులాల బంగారు చైన్ దొంగిలించికుపోయారు. ఆగస్ట్ 21, 2023న మేడిపల్లి అంగడిలో ఇద్దరు భార్యాభర్తలు కూరగాయలు అమ్ముకొని  తమ ఆటోలో తిరిగి కోరుట్లకు వెళుతున్న సమయంలో రాత్రి అదే  ముగ్గురు నిందితులతో పాటు 14 ఏళ్ల  మైనర్ బాలుడు ముందుగానే అనుకున్న పథకం ప్రకారం మేడిపల్లిలోవారి  ఆటో ఎక్కి మేడిపల్లి శివారులోని ఎస్సారెస్పీ కెనాల్ వద్ద ఆటో ఆపి పెప్పర్ స్ప్రే తీసి డ్రైవర్ కళ్ళలో కొట్టి అతడి జేబులో నుండి డబ్బులు తీసేందుకు ప్రయత్నం చేయగా ఆటో డ్రైవర్, అతని భార్య కేకలు వేయగా  దొరికిపోతామేమో భయపడి అప్పటికే అక్కడ కాపు కాస్తున్న అభిషేక రాజపుత్ తో  కలిసి నలుగురు అక్కడి నుండి పారిపోయారు. గురవారం కూడా ఇదే క్రమంలో  ఏదైనా దోపిడీ చేద్దామని ప్రకాష్, దరొగ, అభిజిత్ రాజాపుత్ అను ముగ్గురు వ్యక్తులు రెండు పెప్పర్ స్ప్రే పట్టుకొని మెట్పల్లి బస్టాండ్ ప్రాంతంలో అనుమానాస్పదంగా తిరుగుతుండగా మెట్పల్లి సి.ఐ పోలీసు సిబ్బందితో కలిసి వారిని అదుపులోకి తీసుకుని, వారి వద్ద 2  పెప్పర్ స్ప్రేలు, 3 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకొని ముగ్గురిని అరెస్టు చేసినట్లు ఎస్పీ తెలిపారు.  ముఠాలోని మైనర్ బాలుడు పరారీలో ఉన్నాడని అతడిని  త్వరలోనే పట్టుకుంటామని పేర్కొన్నారు. దారి దోపిడీ ముఠా సభ్యుల్ని పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన కోరుట్ల సి.ఐ ఎం. ప్రవీణ్ కుమార్, మెటపల్లి సి.ఐ కె. లక్ష్మీనారాయణ , కోరుట్ల ఎస్సై కిరణ్ కుమార్, మేడిపల్లి ఎస్సై చిరంజీవి, పోలీస్ సిబ్బందిని జిల్లా ఎస్పీ అభినందించారు.

గంజాయి రవాణా చేస్తున్న ముగ్గురు నిందితుల అరెస్ట్

కోరుట్ల సిఐ. ప్రవీణ్ కుమార్, ఎస్ఐ. కిరణ్ కుమార్, హెడ్ కానిస్టేబుల్  శ్రీనివాస్, కానిస్టేబుల్స్ కేశవ్, సాగర్ కోరుట్ల శివారులోని వెటర్నరీ కాలేజీ ముందు వాహనాలు తనిఖీ చేస్తున్నారు.  ముగ్గురు వ్యక్తులు అనుమానాస్పదంగా బైక్ ఫై వెళ్తుండగా పోలీసులు వారిని పట్టుకునే ప్రయత్నం చేయగా పారిపోయెందుకు ప్రయత్నించగ పట్టుకున్నారు.  వారి వద్ద తనిఖి చేయగా సంచి లో 13 కిలోల పచ్చి గంజాయి దొరికింది. మహారాష్ట్రలోని అమరావతి జిల్లా గుల్తాస్ నగర్ కు  చెందిన ఆనిస్ ఖాన్, అంకర్ నగర్ కు చెందిన ఫిరోజ్ ఖాన్, తుగావ్ పీప్రి గ్రామానికి చెందిన ఫిరోజ్ ఖాన్ లు ఆంధ్ర, ఒరిస్సా సరిహద్దులో గుర్తు తెలియని వ్యక్తుల నుంచి తక్కువ ధరకు  గంజాయి కొనుగోలు చేసి  మహారాష్ట్ర లోని అమరావతి లో ఎక్కువ ధరకు అమ్మి సులువుగా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశ్యంతో 13 కిలోల పచ్చి గంజాయిని  తెల్లని గుడ్డలో పెట్టి పోలీసులు గుర్తించకుండా  పొట్ట  చుట్టు కట్టుకొని బైక్ ఫై వెళ్తుండగా అనుమానించి పోలీసులు పూర్తి స్థాయిలో తనఖిలు చేయగా పట్టుబడ్డారు. తాసిల్దారు సమక్షంలో పంచనామా నిర్వహించి వారి వద్ద నుంచి 13 కిలోల పచ్చి గంజాయి, రెండు మోటార్ సైకిల్లు రెండు సెల్ ఫోన్లు,స్వాధీనం చేసుకుని రిమాండ్ కు పంపినట్లు ఎస్పి తెలిపారు. గంజాయి పట్టుకోవడానికి కృషి చేసిన అధికారులను జిల్లా ఎస్పీ అభినందించారు.

జిల్లా ఎస్పి మాట్లడుతూ గంజాయి రవాణా, అమ్మడం, సేవించడం నేరము నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రాఫిక్ సబ్ స్టాన్స్ యాక్ట్ 1985 ప్రకారం శిక్షార్హులు అవుతారని  చట్టాలు బలంగా ఉన్నాయని తల్లిదండ్రులు పిల్లల ప్రవర్తనపై  దృష్టిపెట్టాలని, ప్రవర్తనలో మార్పులు ఎప్పటికప్పుడు గమనిస్తు సరైన మార్గ నిర్దేశం చేయాలని తర్వాత బాధపడి లాభం లేదనన్నారు. జిల్లా లో  గంజాయి, డ్రగ్ నేరస్థుల రికార్డులను  మెయింటేన్ చేయడం జరుగుతుంది  పదే పదే నేరాలకు పాల్పడుతున్న వారిపై పి.డి. యాక్ట్ లు పెట్టేలా చర్యలు తీసుకుంటమన్నారు. గంజాయి, మరే ఇతర మత్తు పదార్థాలు అమ్ముతున్నట్లు రవాణా చేస్తున్నట్లు సమాచారం ఉంటే వెంటనే పోలీస్ స్టేషన్ కి లేదా డయల్100 కు సమాచారం అందించాలని, సమాచారం అందించిన వారి పేర్లను గోప్యంగా ఉంచుతామని తెలిపారు.