బండి సంజయ్ అరెస్టు నిరసిస్తూ బిజేపి ధర్నా 

బండి సంజయ్ అరెస్టు నిరసిస్తూ బిజేపి ధర్నా 

బిజెపి నాయకుల ముందస్తు  అరెస్టు

ముద్ర ప్రతినిధి, జగిత్యాల : బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్  అరెస్ట్ కు నిరసనగా జగిత్యాల జిల్లా కేద్రంలోని తహసిల్ చౌరస్తాలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్బంగా జిల్లా అధ్యక్షుడు మోరపల్లి సత్యనారాయణ రావు మాట్లాడుతూ ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికయిన ఒక ఎంపిని అర్ధరాత్రి అరెస్ట్ చేయడం దారుణం అన్నారు. పేపర్ లీకులకు పాల్పడుతున్న బిఆర్ ఎస్ ప్రభుత్వాన్ని ప్రస్నిస్తున్నడనే అక్కసుతో అక్రమ అరెస్టులకు పాల్పడ్డారని దీనిని తీవ్రంగా కండిస్తున్నమన్నారు . ఈ కార్యక్రమంలో  బిజెపి నాయకులు చిలకమర్రి మదన్మోహన్, వీరబత్తిని అనిల్, రాగిల సత్యనారాయణ, భూమి రమణ,  కొక్కు గంగాధర్, నలువల తిరుపతి, రెంటం జగదీష్, ఆమోద రాజు, పవన్ సింగ్, చింత అనిల్, కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు.

బిజెపి నాయకుల అరెస్టు
 బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్  అరెస్ట్ కు నిరసనగా బిజెపి నాయకులు ఆందోళన చేపడతారని ఉద్దేశంతో రాత్రి జగిత్యాల పట్టణంతో పాటు మండలంలోని పలువురు బిజెపి నాయకులు అదుపులోకి తీసుకొని పట్టణ, రూరల్ పోలీస్ స్టేషన్ లకు  తరలించారు. బిజెపి నాయకురాలు మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ బోగ శ్రావణిని పోలీసులు గృహ నిర్బంధం చేశారు  ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరని బి అర్ యస్  ప్రభుత్వం  ముందస్తు అరెస్ట్ లను ఖండించారు.  బిజెపి జగిత్యాల అసెంబ్లీ కన్వీనర్ చిలకమర్రి మదన్ మోహన్, పట్టణ అధ్యక్షులు వీరబత్తిని అనిల్ కుమార్, కౌన్సిలర్ గుర్రం రాము, ఆముదరాజు, నక్క జీవన్, నలువాల అశోక్ , గట్టుపల్లి జ్ఞానేశ్వర్  జగిత్యాల రూరల్ బిజెపి మండల అధ్యక్షుడు నలువాల తిరుపతి,  బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షుడు మెరుగు ఉమేష్,  బిసి మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడు గజేందర్, బీజేవైఎం మండల అధ్యక్షుడు పూదరి శ్రీనివాస్, కిసాన్ మోర్చా మండల అధ్యక్షుడు కర్నే నర్సింహారెడ్డి, దళిత మోర్చా అధ్యక్షుడు తరాల మహేష్, మాజీ దళిత మోర్చా జిల్లా కార్యదర్శి దుబ్బాక రమేష్, నరేష్ లను పోలీస్ లు అరెస్టు చేశారు.