మహిళలల పట్ల దురుసుగా వ్యవహారించిన ఎస్ ఐ సస్పెండ్

మహిళలల పట్ల దురుసుగా వ్యవహారించిన ఎస్ ఐ సస్పెండ్

ముద్ర ప్రతినిధి, జగిత్యాల: జగిత్యాల బస్సు డిపో దగ్గర  ఆర్టీసీ బస్సులో  మహిళ పట్ల జగిత్యాల రూరల్ ఎస్ ఐ అనిల్ దురుసుగా ప్రవర్తించి చెయి చేసుకున్నారని బాధిత మహిళల పక్షాన జగిత్యాల పట్టణంలో ముస్లిం మైనారిటీలు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. ఈ సంఘటన పై విచారణ జరిపి నివేదిక ఆధారంగా క్రమశిక్షణ చర్యలో భాగంగా ఎస్సై అనిల్  ను  సస్పెండ్ చేస్తూ  మల్టీజోన్ -1 IG  చంద్రశేఖర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేసినట్లు జగిత్యాల జిల్లా ఎస్పీ ఎగ్గడి భాస్కరు తెలిపారు. 

నాఫైనే దాడి చేశారు ఎస్ఐ  భార్య సంధ్య 
నిన్న జరిగిన బస్సు సంఘటనలో మైనార్టీ మహిళ పై రూరల్ ఎస్సై అనిల్ కుమార్ దాడి చేశారంటూ వచ్చిన వార్తల ఫై ఎస్ఐ భార్య సంధ్య మీడియా ముందుకు వచ్చింది. ఈ సందర్బగా సంధ్య మాట్లాడుతూ ఎస్సై అనిల్ కుమార్ దాడి చేశారంటూ వచ్చిన వార్తల  ఖండిస్తున్న. మేము బస్సులో సీట్లు లేకపోవడంతో మైనారిటీ మహిళ ల ప్రక్కన కూర్చొని మా కొడుకుకి పాలు ఇస్తుండగా మీరు హిందువులు మా ప్రక్కన కూర్చోవద్దు అంటూ నన్ను బూతులు తిడుతూ మా అన్నయ్య రౌడి షీటర్ అంటూ మిమ్మల్ని  బస్ దిగిన వెంటనే మీ అంతు చూస్తామని నాపై తల్లికుతుర్లు దాడి చేశారని చేతిపైన ఉన్న గాయాలు చూపారు. తన భర్త అనిల్ ఎలాంటి దాడి చేయలేరని నాకు ప్రాణహాని ఉందని నేను నా భర్తకు ఫోన్ చేశానని అందుకే వచ్చాడని కేవలని ముస్లిం హిందువులని గొడవలు చేస్తున్నారని నాకు ముస్లింలపై ఏదైనా చేడు అభిప్రాయం ఉంటే ముస్లిం ప్రక్కన ఎందుకు కూర్చుంటానన్నారు.. నా భర్త పై కక్ష తోనే ఇలా చేస్తున్నారని పేర్కొంది. ఎస్సై అనిల్ కుమార్ ను సస్పెండ్ చేయడంతో తల్లిదండ్రులు, భార్య రోదిస్తూ అనీల్ కు న్యాయం చేయాలని కోరుతున్నారు.