రెడ్ క్రాస్ సొసైటీలో చేరడం ఒక సామాజిక బాధ్యత- జిల్లా కలెక్టర్ యాస్మిన్ భాషా | Mudra News

రెడ్ క్రాస్ సొసైటీలో చేరడం ఒక సామాజిక బాధ్యత- జిల్లా కలెక్టర్ యాస్మిన్ భాషా | Mudra News

ముద్ర ప్రతినిధి జగిత్యాల: ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ లో చేరడం ఒక సామాజిక బాధ్యత అని, రక్తదానం మహాదానం అని అంటూ... విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడంలో తరగతి గదిలో ఉపాధ్యాయులదే ప్రధాన పాత్ర అని జిల్లా కలెక్టర్ యాస్మిన్ భాషా అన్నారు. పి ఆర్ టి యు టిఎస్ ఉపాధ్యాయ సంఘం ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకొని పిఆర్టియు- ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిర కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రక్తదానం ఆవశ్యకత, సమాజంలో ఉపాధ్యాయుల పాత్ర, సామాజికపరంగా విద్యార్థులను తీర్చిదిద్దడంలో చేయాల్సిన కృషి, తదితర అంశాలపై వివరించారు.

ఈ సందర్భంగా విరూపాక్షి గార్డెన్స్ లో జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా కమిటీ చైర్పర్సన్ గా యాస్మిన్ భాషా మాట్లాడుతూ.. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీలో అన్ని వర్గాల వారిని చేర్చడంలో ఉపాధ్యాయ వర్గాలు సహకరించాలని ఆమె కోరారు.ఈ కార్యక్రమంలో కలెక్టర్ తో పాటుగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా పి.శ్రీధర్, రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా కార్యదర్శి మంచాల కృష్ణ, జిల్లా కమిటీ సభ్యులు, జర్నలిస్టు సిరిసిల్ల శ్రీనివాస్,  జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు యాళ్ల అమర్నాథ్ రెడ్డి బి ఆనంద్ రావు తో పాటుగా మంచిర్యాల కు చెందిన రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ వైద్యుడు డా.హన్మంతరావు, జిల్లాలోని అన్ని మండలాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.