నాడు కరువు కాటకాలు, నేడు సిరుల పంటలు

నాడు కరువు కాటకాలు, నేడు సిరుల పంటలు
  • నాడు కాలువల్లో కంపచెట్లు - నేడు నిండుగా కాలేశ్వరం జలాలు
  • ముఖ్యమంత్రి కెసిఆర్ కు, ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ కు హ్యాట్సాఫ్ చెబుతున్న రైతులు

తుంగతుర్తి ముద్ర: తుంగతుర్తి నియోజకవర్గం అంటేనే గతంలో కరువు కాటకాలకు నిలయంగా ఉండేది. వర్షాలు కురిస్తేనే పంటలు అది కూడా ఆరోకోరగానే మూడు నాలుగు సంవత్సరాలకోసారి చెరువులు నిండేది లేదంటే చెరువుల కింద బీడు భూములే దర్శనమిచ్చేవి. నాడు కొద్దిపాటి భూమి మాత్రమే బావులు బోర్ల కింద సాగయ్యేవి . నియోజకవర్గం ఏర్పాటుఅయిననాటి నుండి తుంగతుర్తిని యోజకవర్గానికి పోచంపాడు కాలువ తేవాలి సాగునీరు రావాలనే మాట వినబడేది. దశాబ్దాలు గడుస్తున్న కాలువలు పూర్తిస్థాయిలో తవ్వకం కాలేదు .ఉమ్మడి రాష్ట్రంలోఅరకొర నిధులతో వర్ధన్నపేట నుండి తుంగతుర్తి నియోజకవర్గం వరకు కాలువలు తవ్వారు. ట్రైలర్ అనే పేర నీరు వదిలారు వచ్చే గోదావరి జలాలకు దశ దిశ లేదు. ఏ ఒక్క చెరువుకు నీరు చేరేలా ఏర్పాట్లు లేవు. కొన్నిచోట్ల అసంపూర్తి కాలువలే ఉండేవి .తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తుంగతుర్తి ఎమ్మెల్యేగా డాక్టర్ గాదరి కిషోర్ కుమార్ మొదటిసారి గెలుపొందడంతో నియోజకవర్గంలో మొట్ట మొదట తీరని సమస్య సాగు నీటి సమస్య ముందుగా సాగునీటి సమస్య పరిష్కారానికి ఎమ్మెల్యే శ్రీకారం చుట్టారు.

తవ్విన కాలువలను ఎలా ఉన్నాయో  ఏనాడు పరిశీలించని నాటి పాలకులు ఎమ్మెల్యేలు దీంతో కాలువలో కంప చెట్లు మొలిచి  విచ్చలవిడిగా మారాయి .నియోజకవర్గం లోకి గోదావరి జలాలు ఎలాగైనా రప్పించాలని పట్టుదలతో ఎమ్మెల్యే స్వయంగా కాలువల పరిశీలన చేపట్టి పూర్తిగా కాలవల పై అవగాహన పెంచుకొని సంబంధిత ఇరిగేషన్ అధికారులతో సమీక్షలు జరిపి వచ్చే నీరు చెరువులో నింపడానికి రంగం సిద్ధం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కు కాలువల సమస్య వివరించి కాలువల ద్వారా వచ్చే నీరు చెరువులలో కి వెళ్లేలా తూములు నిర్మించి అసంపూర్తి కాలువలు పూర్తి చేయించారు .ఇంతలోనే కాలేశ్వరం పూర్తి కావడం నీటి ప్రవాహానికి సిద్ధంగా ఉన్న ఎస్సారెస్పీ కాలువలో  నీరు రావడంతో నియోజకవర్గం లోని కుంటలు చెరువులు నిండి అలుగులు పోసి కళకళలాడాయి. సుమారు నాలుగు ఐదు సంవత్సరాలుగా నియోజకవర్గం లో కరువు ఛాయలే లేవు. సంవత్సర సంవత్సరానికి సాగు విస్తీర్ణం గణనీయంగా పెరుగుతోంది వందల ఎకరాల సాగు పోయి వేల ఎకరాలకు చేరింది.

పుష్కల మైన వరి ధాన్యం పండు తోంది .నాడు ఎడారిగా మారే ప్రమాదం ఉందని పలువురు శాస్త్రవేత్తలు హెచ్చరించిన హెచ్చరికలు అందరికీ తెలుసు .కానీ ఈ నేడు కరువు లేని తుంగతుర్తి నియోజకవర్గ భీడు భూములు కాన రాకుండా పచ్చని పంట పొలాలతో కళకళలాడే వ్యవసాయ క్షేత్రాలలో విరాజిల్లుతోంది .అంతేకాకుండా ఐదారు సంవత్సరాల క్రితం వరకు ఒక లక్ష రూపాయలకు ఎకరం దొరికే భూములు నేడు 40 లక్షల నుండి కోటి వరకు ధర పలుకుతున్నాయి .దీనికి ప్రధాన కారణం సాగునీరు నియోజకవర్గ ప్రజలకు రైతాంగానికి సంతోషాన్ని అందించిన తుంగతుర్తి ఎమ్మెల్యే డాక్టర్ గాదరి కిషోర్ కుమార్ కు సాగు నీరు ఇస్తానని హామీ ఇచ్చి నిలబెట్టుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు తుంగతుర్తి నియోజకవర్గ రైతాంగం హాట్సాఫ్ చెబుతోంది.