రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి  తీవ్రగాయాలు

రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి  తీవ్రగాయాలు
  • ఒకరి పరిస్థితి విషమం
  • సిరిసిల్ల  ఏరియా ఆసుపత్రికి తరలింపు

 ముద్ర,ఎల్లారెడ్డిపేట: రాజన్న సిరిసిల్ల జిల్లా  ఎల్లారెడ్డిపేట మండలం రాగట్లపల్లి గ్రామ శివారులో సోమవారం రాత్రి 7 గంటల ప్రాంతంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి  గాయాలు అయ్యాయి. వేములవాడ పట్టణానికి చెందిన బంధం రాణి తన కుమారులు ప్రశాంత్, ప్రణీత్ లతో కలిసి ద్విచక్ర వాహనంపై ఎల్లారెడ్డిపేట నుంచి వేములవాడ వెళ్తుండగా రాగట్లపల్లె సమీపంలో పదిరా గ్రామానికి చెందిన కమ్మరి భూమయ్య ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనంతో వెనుక వైపు నుంచి అతివేగంగా ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. కాగా భూమయ్యకు కూడా స్వల్పంగా గాయాలయ్యాయి.ఈ సంఘటనలో బంధం రాణి కుమారులకు స్వల్ప గాయాలు కాగా రాణి తలకు బలంగా తగలడంతో  పరిస్థితి విషమంగా  ఉండడంతో సిరిసిల్ల ఏరియా ఆసుపత్రికి  క్షతగాత్రులను అంబులెన్స్ లో ఎల్లారెడ్డిపేట పోలీసులు సిరిసిల్ల ఏరియా ఆసుపత్రికి తరలించారు.