కంటి వెలుగును సద్వినియోగం చేసుకోవాలి

కంటి వెలుగును సద్వినియోగం చేసుకోవాలి

మేళ్ళచెరువు  ముద్ర:  కంటి సమస్యలతో బాధపడుతున్న వారికి స్పష్టమైన కంటిచూపు అందించాలని సదుద్దేశంతో ముఖ్యమంత్రి కేసీఆర్  కంటి వెలుగు పథకాన్ని తీసుకువచ్చినందున ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని  హుజూర్నగర్ మున్సిపల్ చైర్మన్ గెల్లి అర్చన రవికుమార్ కోరారు. సోమవారం హుజూర్నగర్ 25 వార్డు  నందు నిర్వహించిన కంటి వెలుగు శిబిరాన్ని వార్డ్ కౌ న్సిలర్ అస్మా నసిర్ తో కలిసి ప్రారంభించి మాట్లాడుతూ వైద్య ఆరోగ్యశాఖ మున్సిపల్ సిబ్బంది తో కంటి వెలుగు కార్యక్రమం తుది దశకు చేరుకున్నదున ప్రజల్లో విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.ప్రతి శిభిరం వద్ద ప్రజలు బారులు తీరుతున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో  క్యాంపు సూపర్వైజర్ ఇందిరాల రామకృష్ణ , డాక్టర్ సుష్మ, మల్లిక, శివ, మాధవి, వార్డు ఇంచార్జ్ ముత్యాలు, సహిద్, రహిం,జనిపాషా, సహెర ఆశా కార్యకర్తలు మరియ ఆర్ పి లు హేమలత, శారద, నిర్మల పాల్గొన్నారు.