90 సీట్లు గెలుస్తాం - హైట్రిక్ సాదిస్తాం

90 సీట్లు గెలుస్తాం - హైట్రిక్ సాదిస్తాం

బిఆర్ఎస్ ఒక వసుదైక కుటుంబం

భవిష్యత్ అంతా బంగారమే

కార్యకర్తలే మా బలం బలగం

టిఆర్ఎస్ ప్లీనరీలో మంత్రి గంగుల, ఎమ్మెల్యేలు 

ముద్ర ప్రతినిధి కరీంనగర్ : తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ 90 సీట్లు గెలిచి హైట్రిక్ సాధిస్తామని బీసీ సంక్షేమ పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. కరీంనగర్ జిల్లాలోని కరీంనగర్, చొప్పదండి, మానకొండూర్, హుజురాబాద్ నియోజకవర్గాలలో బిఆర్ఎస్ పార్టీ 23 వ ఆవిర్భావ దినోత్సవ ప్లీనరీ సమావేశాలను ఘనంగా నిర్వహించారు. తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి సమావేశాలను ప్రారంభించారు. 12 తీర్మానాలను ఆమోదించుకున్నారు. అనంతరం కరీంనగర్ రాజశ్రీ గార్డెన్లో ఏర్పాటుచేసిన సమావేశంలో గంగుల కమలాకర్ మాట్లాడుతూ బిఆర్ఎస్ ఒక వసుదైక కుటుంబం అని అన్నారు. పార్టీని మనం కాపాడుకుంటే మనకు పార్టీ అండగా ఉంటుందని పేర్కొన్నారు. రాష్ట్ర ఆవిర్భావం అనంతరం దేశం గర్వపడేలా తెలంగాణ అభివృద్ధి పథంలో దూసుకుపోతుందని పేర్కొన్నారు. భారత్ ప్రపంచంలో అగ్రస్థానంలో నిలవాలంటే కెసిఆర్ లాంటి విజన్ ఉన్న నేత ప్రధాని కావాలని ఆకాంక్షించారు.

దేశంలో ఎక్కడా లేనివిధంగా సంక్షేమ పథకాలతో అన్ని వర్గాల ప్రజలను ఉన్నత స్థితికి చేర్చడమే లక్ష్యంగా కేసీఆర్ ప్రణాళిక బద్ధంగా ముందుకెళుతున్నారని వెల్లడించారు. టిఆర్ఎస్ పార్టీకి కార్యకర్తలే బలం బలగం అని అన్నారు. తెలంగాణపై కేంద్రం మొండివైఖరి సరికాదన్నారు. కరీంనగర్ ప్రపంచస్థాయి పర్యాటక కేంద్రంగా రూపుదిద్దుకుంటుందని వెల్లడించారు మానేరు రివర్ ఫ్రంట్, కేబుల్ బ్రిడ్జి తో పాటు అనేక నూతన సంస్కరణలు తీసుకువస్తున్నామని వెల్లడించారు. క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలుగా బిఆర్ఎస్ ను వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి తీసుకురావడానికి సైనికుల్లా పని చేయాలని సూచించారు. కాళేశ్వరం నీటితో భూమి బరువయ్యే పంట పండుతుందని ఈ సీజన్లో కోటి 20 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వచ్చిందని వెల్లడించారు. దేశానికి తెలంగాణ అన్నపూర్ణగా మారింది అన్నారు. రసమయి బాలకిషన్, సుంకే రవిశంకర్, పాడి కౌశిక్ రెడ్డి, జిల్లా అధ్యక్షులు జివి రామకృష్ణారావు లు కార్యకర్తలకు దిశా నిర్దేశనం చేశారు.