రోహిత్ రావు ఇంటి ముందు శవయాత్ర - నగరంలో జీకే యూత్ హల్ చల్

రోహిత్ రావు ఇంటి ముందు శవయాత్ర - నగరంలో జీకే యూత్ హల్ చల్

ముద్ర ప్రతినిధి కరీంనగర్: కరీంనగర్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు, ఎమ్మెస్సార్ మనవడు రోహిత్ రావు ఇంటి ముందు గంగుల కమలాకర్ యూత్ ఆధ్వర్యంలో శవ యాత్ర చేసి దిష్టిబొమ్మను దగ్ధం చేయడం కలకలం సృష్టించింది. టిపిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి విద్యుత్ 24 గంటల కరెంటు పై చేసిన వ్యాఖ్యలు కరీంనగర్ లో దుమారం రేపుతున్నాయి. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు నిరసనగా తెలంగాణ చౌక్ లో దిష్టిబొమ్మతో నిరసన వ్యక్తం చేసిన జీకే యూత్ సభ్యులు అక్కడే నుండి కాలినడకన డప్పు చప్పులతో మేనేని రోహిత్ రావు ఇంటి వద్దకు చేరుకొని హల్ చల్ చేశారు. రేవంత్ రెడ్డి డౌన్ డౌన్, తెలంగాణ ద్రోహి రేవంత్ అంటూ నినాదాలతో హోరెత్తించారు. అనంతరం పోలీసులు చేరుకొని  కార్యకర్తలను చెదరగొట్టారు. తెలంగాణ చౌక్ లో దిష్టిబొమ్మ దహనం చేసి రోహిత్ రావు ఇంటి వరకు కాలినడకన చేరుకునే వరకు పోలీసులు చూసి చూడనట్లు వ్యవహరించడం పలు విమర్శలకు తావిస్తుంది.