ప్రభుత్వానికి రైస్ ఇండస్ట్రీ కి మధ్య వారధిగా పనిచేస్తా

ప్రభుత్వానికి రైస్ ఇండస్ట్రీ కి మధ్య వారధిగా పనిచేస్తా
Serve as a bridge between the government and the rice industry
  • తెలంగాణ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీగా అన్నమనేని సుధాకర్ రావు
  • కరీంనగర్ జిల్లా మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా నర్సింగరారావు ఏకగ్రీవం

 ముద్ర ప్రతినిధి కరీంనగర్: రాష్ట్ర ప్రభుత్వానికి రైస్ ఇండస్ట్రీకి మధ్య సమస్యల పరిష్కారానికి వారధిగా పనిచేస్తానని నూతనంగా ఎన్నికైన తెలంగాణ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ  చెందిన అన్నమనేని సుధాకర్ రావు అన్నారు. తన ఎన్నికకు సహకరించిన ఇండస్ట్రీ పెద్దలకు ధన్యవాదాలు తెలిపారు. కరీంనగర్ జిల్లా అధ్యక్షుడిగా నర్సింగరారావు కోశాధికారిగా జి ఆనంద్ రావు లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

ఈ మేరకు అసోసియేషన్ కార్యవర్గం నిర్ణయం తీసుకుందని రాష్ట్ర రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గంపా నాగేందర్  ఒక ప్రకటనలో వెల్లడించారు. అనంతరం ఎన్నికైన అభ్యర్థులను రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అభినందించారు. మిల్లింగ్ ప్రక్రియ, రైస్ ఇండస్ట్రీపై సంపూర్ణ అవగాహన కలిగిన వ్యక్తిగా ఇటు ఇండస్ట్రీకి అటు ప్రభుత్వానికి మద్య సమయంతో సుధాకర్ రావు పనిచేస్తారని అభిప్రాయపడ్డారు. ఈ నియామకం ద్వారా తెలంగాణ ప్రభుత్వ లక్ష్యం మేరకు మిల్లింగ్ ప్రక్రియ వేగంగా జరగడానికి, మిల్లింగ్ ఇండస్ట్రీ ఎదుర్కొంటున్న సమస్యల సత్వర పరిష్కారాలకు దోహదపడుతుందని ఇండస్ట్రీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. జిల్లా ప్రధాన కార్యదర్శి కార్యవర్గ సభ్యుల ఎన్నిక జరగాల్సి ఉంది.