అభివృద్ధిని చూసే బిఆర్ఎస్ లోకి  - బిచ్చు నాయక్

అభివృద్ధిని చూసే బిఆర్ఎస్ లోకి  - బిచ్చు నాయక్

మూడోసారి ఎమ్మెల్యేగా గొంగిడి సునీత మహేందర్ రెడ్డి - గట్టు తేజస్వి నిఖిల్

తుర్కపల్లి,ముద్ర : తుర్కపల్లి మండల బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో బిఆర్ఎస్ పార్టీలో చేరిన ముల్కలపల్లి   ఎంపీటీసీ ప్రతిభ రాజేష్ నాయక్ , మోతిరం తండా సర్పంచ్, కాంగ్రెస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి బిచ్చు నాయక్, మల్కాపురం కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు కలకుంట్ల కృష్ణ, బిల్య నాయక్ తండ కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు బుక్య రమేష్ నాయక్, తుర్కపల్లి సోషల్ మీడియా కన్వీనర్ బండారి శ్రీను,తుర్కపల్లి మండల కేంద్ర వార్డ్ మెంబర్ ఆకుల సతీష్ లను బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మోతిరం తండా సర్పంచ్ బిచ్చు నాయక్ మాట్లాడుతూ.. బిఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై బిఆర్ఎస్ పార్టీలో చేరామని అన్నారు. గిరిజన తండాలను  గ్రామపంచాయతీలుగా మార్చడంతో తండాలు అభివృద్ధి చెందాయని తెలిపారు.ప్రతి ఇంటికి కెసిఆర్ ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాలు అందాయని అన్నారు.అనంతరం బిఆర్ఎస్ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ గట్టు తేజస్వి నిఖిల్ మాట్లాడుతూ..బిఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి ని నియోజకవర్గంలో ప్రజలు అధిక మెజార్టీతో గెలిపిస్తూ హ్యాట్రిక్ సాధించడం ఖాయమని అన్నారు.ఆలేరు నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలతో పాటు బిఆర్ఎస్ పార్టీ తీసుకొచ్చిన ఎన్నికల మేనిఫెస్టో తో మూడోసారి ఆలేరు గడ్డపై గులాబీ జెండా ఎగరవేయడం ఖాయమన్నారు.

రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ అవుతారని ధీమా వ్యక్తం చేశారు. గతంలో కాంగ్రెస్ 50 ఏళ్ల పాలల్లో నిజకవర్గంలో జరిగింది ఏమి లేదని సకల జనుల త్యాగాలతో తెలంగాణను సాధించుకున్నామని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా మార్చాలని దేశంలోనే ఏ రాష్ట్రంలో లేని అభివృద్ధి తెలంగాణలో జరిగిందని, ప్రపంచంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా పేరు ప్రఖ్యాతలు తీసుకొచ్చిన ముఖ్యమంత్రి అని కొనియాడారు. కాంగ్రెస్ బిజెపి మాటలను నమ్మొద్దని వారు అధికారంలోనికి వస్తే సస్యశ్యామలంగా ఉన్న తెలంగాణ రాష్ట్రం అంధకారంలోనికి వెళ్లడమే కాకుండా సంక్షేమ పథకాలను నీరు గారిచే ప్రయత్నం చేస్తారని అన్నారు. మండల అభివృద్ధి ముందుకెళ్లే విధంగా గొంగిడి సునీత మహేందర్ రెడ్డి కారు గుర్తుకే ఓటు వేసి అధిక మెజార్టీతో గెలిపించాలని గట్టు తేజస్వి నిఖిల్ మండల ప్రజలను కార్యకర్తలను కోరారు. ప్రతి గ్రామ గ్రామాన కార్యకర్తలు, నాయకులు, ప్రచారాన్ని నిర్వహించి భారీ మెజార్టీ దిశగా వెళ్లాలని సూచించారు. రాబోయే కాలంలో ఆలేరు నియోజకవర్గం గొంగిడి సునీత మహేందర్ రెడ్డి దంపతుల సహకారంతో ఆలేరు ప్రదాత  పేరు గావిస్తారని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో జెడ్పి వైస్ చైర్మన్ బీకు నాయక్, బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు నరేందర్ రెడ్డి, సెక్రటరీ జనరల్ పరమేష్ యాదవ్, సర్పంచులు కల్లూరి ప్రభాకర్ రెడ్డి, నాంసాని సత్యనారాయణ, మాజీ ఎంపీపీ బబ్బురి రవీంద్రనాథ్ గౌడ్, భూఖ్య రవీందర్ నాయక్, మాజీ ఎంపీటీసీ తలారి శ్రీనివాస్, మాజీ కో ఆప్షన్ యాకుబ్,గుడిపాటి కరుణాకర్ రెడ్డి,గుంటి శ్రీశైలం,రాజయ్య, వద్దు నాయక్, భాస్కర్ నాయక్,పాండు, పుల్లెల బాలరాజు, గడ్డమీది యాదగిరి,తదితరులు పాల్గొన్నారు.