కేసీఆర్, రేవంత్ ఇద్దరు రెండు చోట్ల ఓడిపోవడం ఖాయం - కాటిపల్లి వెంకట రమణ రెడ్డి

కేసీఆర్, రేవంత్ ఇద్దరు రెండు చోట్ల ఓడిపోవడం ఖాయం - కాటిపల్లి వెంకట రమణ రెడ్డి

ముద్ర ప్రతినిధి, కామారెడ్డి: కేసీఆర్, రేవంత్ రెడ్డిలు ఇద్దరు రెండు చోట్లా ఓడిపోవడం ఖాయమని బీజేపీ కామారెడ్డి అభ్యర్థి కాటిపల్లి వెంకట్ రమణా రెడ్డి పేర్కొన్నారు.
కామారెడ్డి పట్టణం 9 వ వార్డు పరిధిలోని కల్కి నగర్ లో బీజేపీ కామారెడ్డి అసెంబ్లీ అభ్యర్థి కాటిపల్లి వెంకట రమణ రెడ్డి హనుమాన్ దేవాలయంలో పూజలు చేసి ప్రచారం నిర్వహించారు.

ఈ సందర్భంగా బ మాట్లాడుతూ అధికార పార్టీ నాయకులు బెదిరిస్తూ గులాబీ కండువాలు కప్పుతున్నారని, కానీ బెదిరిస్తే కండువాలు వేసుకుంటారు కానీ ఓటు వేస్తారు అనుకోవడం అవివేకం అని ఏద్దేవా చేశారు. ఇప్పుడే బెదిరిస్తే KCR గెలిస్తే వాళ్ల అరాచకాలు ఎలా ఉంటాయి ప్రజలు గమనించాలని అన్నారు. బీజేపీ గెలిస్తే కామారెడ్డి పొలిటికల్ బ్రోకర్లు తట్ట బుట్ట సదురుకోవాల్సిందేననీ, KCR, రేవంత్ ఇద్దరు రెండు చోట్ల ఓడిపోతారనీ జోస్యం చెప్పారు.