స్నానం చేయిస్తాం....ఓట్లు రాబడుతాం

స్నానం చేయిస్తాం....ఓట్లు రాబడుతాం

మెట్‌పల్లి ముద్ర: స్నానం చేయిస్తూ ఓట్లు రాబడతామంటు బావి వద్ద స్నానం చేస్తున్న ఓ రైతుకు స్నానం మేము చేయిస్తాం ఓట్లు మా పార్టీకే వేయండి అంటూ అడుగుతున్న దృశ్యం జగిత్యాల జిల్లా ఇబ్రహింపట్నం మండలం లోని వేములకూర్తి గ్రామం లో జరిగింది. బీఆర్ఎస్ పార్టీ కోరుట్ల అభ్యర్థి డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ కు మద్దతుగా శుక్రవారం ఇబ్రహీంపట్నం మండల ప్రచార కార్యదర్శి పెంట లింబాద్రి, యామపూర్ సహకార సంఘ చైర్మన్ అంకతి రాజన్న ,ఉపసర్పంచ్ అసతి పెద్ద రాజం,రైతు బందు అధ్యక్షుడు పోతరాజు శివరాం లు ఓ రైతు స్నానం చేస్తుండగా వెళ్ళి ఆయనకు నిల్లు పోసి ఓట్లు అడుగుతున్న దృశ్యం అక్కడ ఉన్న వారిని ఆశ్చర్యానికి గురిచేసింది.