రైస్ మిల్లర్ల దోపిడీకి అధికార పార్టీయే బాధ్యత వహించాలి.

రైస్ మిల్లర్ల దోపిడీకి అధికార పార్టీయే బాధ్యత వహించాలి.
  • ప్రభుత్వ పెద్దల కనుసన్నల్లోనే దోపిడీ
  • ఎమ్మెల్సీ టి. జీవన్ రెడ్డి

ముద్ర ప్రతినిధి, జగిత్యాల : ధర్మకాంట తూకం పరిగణలోకి తీసుకోకుండ, ట్రక్ షీట్ మధ్య వ్యత్యాసమే రైస్ మిల్లర్ల దోపిడీ అని, రైస్ మిల్లర్ల దోపిడీకి అధికార పార్టీయే బాధ్యత వహించాలని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. రాయికల్ మండల కేంద్రంలోని మొక్కజొన్న కేంద్రాన్ని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పరిశీలించారు,అనంతరం విలేకరులతో మాట్లాడాతూ కళ్లకు కట్టినట్లుగా దోపిడీ కనపడుతుంటే జిల్లా ప్రభుత్వ యంత్రాంగం..మంత్రిగారు. ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ప్రకటనలకే పరిమితం కాకుండ కార్యాచరణ కార్యరూపం దాల్చబడేవిధంగా రైతాంగం శ్రమకు తగ్గ పరిహారం కల్పించేవిధంగా ధర్మకాంటను పరిగణలోకి తీసుకొని, చెల్లింపులు చేయాలన్నారు. అన్ లోడింగ్ జాప్యం లేకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.  పన్నెండు రోజులుగా ఎండ తీవ్రత పెరగడంతో ధాన్యంలో తేమశాతం 17 ఉండాల్సి ఉండగా 12శాతానికి తగ్గిందని, తూకంలోనే రైతు ప్రతి క్వింటాలు కు 5 కిలోలు నష్టపోతున్నారని అన్నారు.

ధాన్యం సేకరణ అమలులో నిర్వాహకుల నిర్లక్ష్యంతో క్విం టాల్ కు రూ.1800లక అమ్ముకోవాల్సిన పరిస్థితి ఎదురవుతోందని అన్నారు. మొక్కజొన్న ఎవరూ సేకరిస్తున్నారో కూడా తెలియని పరిస్థితి నెలకొందని, ఇంతవరకు అధికారులు ఎవరూ సందర్శించిన దాఖలాలు లేవన్నారు. అధికార పార్టీ నాయకులు వ్యవసాయమే తెలంగాణ వచ్చిన తర్వాత ఆరంభించినట్లు, గతంలో ఎప్పుడైన పంటలు పండినాయ అన్నట్లు మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. జగిత్యాల జిల్లాలో దాదాపు 2లక్షల పైచిలుకు సాగులో ఉన్నది. ఎస్సారెస్సీ ఆయకట్టు కాకుండ అదనంగా ఒక్క ఎకరమైన నీరు అందిస్తె చెప్పాలని సవాలు విసిరాలు. కాలువల మరమ్మతులకు దిక్కులేదనీ అసహనం వ్యక్తం చేశారు. గతంలో ఎవరికి వ్యవసాయం చేయడమే రాదన్నట్లుగా అధికార పార్టీ నాయకులే వ్యవసాయం నేర్పించినట్లు మాట్లాడుతున్నారని, రైతులు రాజకీయాలకు అతీతతంగా వంటావార్పుతో నిరసన వ్యక్తం చేస్తూ రోడ్డును దిగ్బందిస్తే అధికారుల స్పందన లేదన్నారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు గోపి రాజిరెడ్డి, ఆదిరెడ్డి, మ్యాకల రమేశ్, మహేందర్ గౌడ్, మహిపాల్, మండ రమేశ్, ఆదిరెడ్డి, లింగం, లక్ష్మణ్ పాల్గొన్నారు.