వైభవంగా గోపాల కృష్ణ భగవానుని కళ్యాణం

వైభవంగా గోపాల కృష్ణ భగవానుని కళ్యాణం
  • కళ్యాణంలో పాల్గొని పూజలు చేసిన జడ్పి చైర్ పర్సన్ 

ముద్ర,మెట్ పల్లి: మెట్ పల్లి వాసవి గారెన్స్ లో డా. బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రిచే  నిర్వహిస్తున్న శ్రీమద్భాగవత సప్తాహప్రవచన జ్ఞానయజ్ఞం కార్యక్రమంలో భాగంగా బుధవారం గోపాల కృష్ణ భగవానుని కళ్యాణం వైభవంగా జరిగింది. ఈ కల్యాణంలో జెడ్పీ చైర్ పర్సన్ శ్రీమతి దావ వసంతసురేష్, కోరుట్ల ఎమ్మెల్యే  కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, సరోజనమ్మ దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ రాణవేణి సుజాత సత్యానారయణ, ఎంపీపీ భీమేశ్వరి జగన్, ప్రజాప్రతినిధులు,మహిళలు,భక్తులు పాల్గొన్నారు.