యాదాద్రిలో లక్ష పుష్పార్చన 

యాదాద్రిలో లక్ష పుష్పార్చన 
Lakh Pusparchana in Yadadri

యాదగిరిగుట్ట ,ఫిబ్రవరి 1 (ముద్ర న్యూస్) యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి క్షేత్రం ప్రధానాలయంలో ఏకాదశి పర్వదినం సందర్భంగా బుధవారం శ్రీ స్వామివారికి లక్ష పుష్పార్చన గావించారు .ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చక స్వాములు నల్లంతిగల్ లక్ష్మీనరసింహాచార్యులు మంత్రోచ్చారణలు చేస్తూ అర్చనలు గావించారు. ఈ కార్యక్రమంలో ఏఈఓ గజ్వేల్ రమేష్ బాబు, సూపరిండెంట్ సురేందర్ రెడ్డి ,ఆలయ అధికారులు ఉద్యోగులు ఉన్నారు.