రాయగిరి లో రజకుల కుల దేవాలయానికి గడప పూజ

రాయగిరి లో రజకుల కుల దేవాలయానికి గడప పూజ

భువనగిరి ఆగస్టు 31 (ముద్ర న్యూస్): భువనగిరి మున్సిపల్ పరిధి రాయగిరి లోని రజకుల కులస్థుల కుల దైవం అయిన ఈదమ్మ మాడెలయ్య నూతనంగా నిర్మిస్తున్నటువంటి దేవాలయాలనికి గురువారం కులస్థుల అందరి అధ్వర్యంలో రాఖి పౌర్ణమి సందర్భంగా నూతన గడప పూజలు నిర్వహించి గడపలు ఎక్కించడం జరిగింది.

 ఈ యొక్క పూజ కార్యక్రమం లో రజక కుల మహిళలు సభ్యులు అధిక సంఖ్య లో పాల్గొన్నారు, రాయగిరి రజక సంఘం అధ్యక్షులు మాట్లాడుతూ పూజ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలుపుతూ అడపడచులకు రాఖీ పూర్ణిమ శుభాకాంక్షలు తెలిపారు, ఈ కార్యక్రమం లో రజక కులస్థులు అధిక సంఖ్య లో పాల్గొన్నారు.