అర్హులైన నిరుపేదల అందరికీ సంక్షేమ పథకాలు అందిస్తాం ఎమ్మెల్యే పైళ్ళ శేకర్ రెడ్డి

అర్హులైన నిరుపేదల అందరికీ సంక్షేమ పథకాలు అందిస్తాం ఎమ్మెల్యే పైళ్ళ శేకర్ రెడ్డి

వలిగొండ (ముద్ర న్యూస్): తెలంగాణ రాష్ట్రంలో బిఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన అన్ని సంక్షేమ పథకాలు అర్హులైన నిరుపేదలందరికీ అందిస్తామని తెలిపారు. శుక్రవారం రోజు వలిగొండ మండల కేంద్రంలోని సాయి గణేష్ ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన కళ్యాణ లక్ష్మి షాది ముబారక్,  గృహలక్ష్మి పథకం పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే పైళ్ళ శేఖర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని లబ్ధిదారులకు చెక్కులను మంజూరు పత్రాలను అందించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తన రాష్ట్ర ప్రజలకు ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతూ దేశంలో ఎక్కడా లేనివిధంగా నిరుపేదలకు, రైతులకు, బడుగు బలహీన  వర్గాల ప్రజలకు మహిళలకు ఎన్నో సంక్షేమ పథకాలను అడగకుండానే ప్రవేశపెట్టిందని తెలిపారు. రైతులే రాజుగా చూడాలని ముఖ్యమంత్రి కెసిఆర్ సంకల్పంతో రైతులకు పెద్దపీట వేస్తూ అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారని అన్నారు. రాష్ట్రంలో పక్షాలు గృహలక్ష్మి విషయంలో ఏవో అపోహలు రెచ్చగొట్టి ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని తెలిపారు.

అర్హులైన నిరుపేదలందరికీ గృహ లక్ష్మి పథకం అందించేందుకు కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి వాకిటి పద్మ అనంతరెడ్డి, వైస్  ఎంపీపీ భాతరాజు ఉమా బాల నరసింహ, మార్కెట్ కమిటీ చైర్మన్ పైళ్ళ రాజ వర్ధన్ రెడ్డి, పిఎసిఎస్ చైర్మన్ సురకంటి వెంకటరెడ్డి, రైతు సమన్వయ సమితి చైర్మన్ పనుమతి మమత, ఎంపీటీసీలు పల్సం రమేష్,  కుందరపు యశోద, పల్లేర్ల భాగ్యమ్మ, నోముల మల్లేష్, వివిధ గ్రామాల సర్పంచులు  బోల్ల లలిత, మద్దెల మంజుల,కోమరెల్లి రమ, అన్నమెరి ,శివ శాంత రెడ్డి, సందీప్,  తుమ్మల వెంకట్ రెడ్డి, నరసింహ, ఉప్పల్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు తుమ్మల వెంకటరెడ్డి,  ముద్దసాని కిరణ్ కుమార్ రెడ్డిలు పాల్గొన్నారు.