మట్కా,జూదం పై ఉక్కుపాదం: జిల్లా ఎస్పీ కోటిరెడ్డి

మట్కా,జూదం పై ఉక్కుపాదం: జిల్లా ఎస్పీ కోటిరెడ్డి
Minister Jagadish Reddy
  • తాండూర్ లో మట్కా సెంటర్ లపై టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడి
  • మట్కా రాయుల్లని అదుపులోకి తీసుకున్న పోలీసులు 

వికారాబాద్, ముద్ర ప్రతినిధి: మట్కా ఆడిన ఎంతటి వారైనా ఉపేక్షించేదిలేదని, కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ కోటిరెడ్డి హెచ్చరించారు. బుధవారం సాయంత్రం తాండూర్ పట్టణంలోని గాంధీనగర్ లో టాస్క్ ఫోర్స్ బృందం మట్కా సెంటర్ పై దాడి చేసి మట్కా చిట్టిలు,8140రూపాయలు 4 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకోగా,మరో కాలనీ మనిక్ నగర్ లో మట్కా చిట్టీలు,3100 రూపాయల నగదు,1 సెల్ ఫోన్ స్వాధీనం చేసుకొని తాండూర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు.

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. మట్కా ఆడటం చట్టరీత్యా నేరమని, మట్కా ఆడి జీవితాలను నాశనం చేసుకోవద్దన్నారు. కొందరు పలు చోట్ల అడ్డలుగా చేసుకొని మట్కా లు ఆడుతున్నారని ఇది సరికాదన్నారు. మట్కా,జూదం ఆడటం వల్ల కుటుంబాలు నాశనమవుతాయని,మట్కా, జూదం ఆడినా, ఆడించినా చర్యలు తప్పవన్నారు. ఎక్కడైనా ఎవరైనా పేకాట ఆడితే తమకు సమాచారం అందించాలని, సమాచారం అందించిన వారి పేర్లను గోప్యంగా ఉంచుతామన్నారు.ఈ దాడిలో జిల్లా టాస్క్ ఫోర్స్ పోలీసులు పాల్గొన్నారు.