కాంగ్రెస్ అధికారం చేపడితే తెలంగాణ రాష్ట్రానికి ఉజ్వల భవిష్యత్తు ఉంటుంది

కాంగ్రెస్ అధికారం చేపడితే తెలంగాణ రాష్ట్రానికి ఉజ్వల భవిష్యత్తు ఉంటుంది
  • వికారాబాద్ జిల్లా కొడంగల్ లో పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నామినేషన్ దాఖలు
  • వేలాది మంది ప్రజలు, కాంగ్రెస్ నేతలు,కార్యకర్తల తో ర్యాలీ 

ముద్ర ప్రతినిధి, వికారాబాద్:కాంగ్రెస్ అధికారం చేపడితే తెలంగాణ రాష్ట్రానికి ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. సోమవారం వికారాబాద్ జిల్లా కొడంగల్ పట్టణంలో భారీ ఎత్తున తరలి వచ్చిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానుల ర్యాలీ నిర్వహించిన అనంతరం స్థానిక రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో తన నామినేషన్ పత్రాలను సమర్పించారు. అంతకు ముందు ర్యాలీనీ ఉద్దేశించి రేవంత్ రెడ్డి ప్రసంగించారు.

కొడంగల్ ప్రజల ఆశీర్వాదం తోనే ఢిల్లీ స్తాయికి చేరుకుని పిసిసి అధ్యక్షుడిగా పదవి పొందానని అన్నారు. వేలాధిగా తరలివచ్చి అభిమానం ఆదరణ చూపిన మీరు ఎన్నికల్లో నన్ను ఆశీర్వదించండి మీకు అన్ని వేళల్లో మీ పనులు చేసి పెడతా.మీ ఆత్మాభిమానాన్ని నిలబెడతానని హామీ ఇచ్చారు. మీరు ఇచ్చే ఆశీర్వాదం తోనే డిసెంబర్ 9న రాష్ట్రం లో కీలక పదవిని చేపడతానని అన్నారు. సిఎం కేసిఆర్ కొడంగల్ ను దత్తత తీసుకుని ఒరగబెట్టిందేమి లేదనీ విమర్శించారు. నేను రాష్ట్రం లో కాంగ్రెస్ పార్టీ నీ గెలిపించేందుకు 119 నియోజకవర్గాలు తిరగవలసి ఉంటుందని , ఎపుడు వీలు ఉంటే అపుడు కొడంగల్ కు వచ్చి మిమ్మల్ని కలుస్తానని అన్నారు. మాజీ ఎమ్మెల్యే గురునాథ్ రెడ్డి, కాంగ్రెస్ నియోజకవర్గం ఇంఛార్జి తిరుపతి రెడ్డి తదితరులున్నారు.