బీఅర్ఎస్ లో చేరికలే నా విజయానికి నిదర్శనం..

బీఅర్ఎస్ లో చేరికలే నా విజయానికి నిదర్శనం..

పార్టీ కోసం కష్ట పడి పని చేసిన వారికి సరైన గుర్తింపు.. - ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి

ముద్ర ప్రతినిధి, వికారాబాద్: బీఅర్ఎస్ లో చేరికలే నా విజయానికి నిదర్శనం అని ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి  అన్నారు. యాలాల మండలం బిజేపి సీనియర్ నాయకుడు రామ్య నాయక్, బషీరాబాద్ మండల క్యాద్గిరా గ్రామ బిజేపి యువ నాయకుడు, కోట్ పల్లి మండలం ఇందోల్, గుండ్ల మడుగు తండా కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి  సమక్షంలో గులాబీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికలలో బీఅర్ఎస్ పార్టీ మూడవసారి అధికారంలోకి రానుందని మళ్ళీ నేను భారీ మెజారిటీతో గెలవబోతున్నానని అన్నారు. ఎన్నికల్లో పార్టీ కోసం కష్ట పడి పని చేసిన వారికి సరైన గుర్తింపు లభిస్తుందని అన్నారు. కుల సంఘాల మద్దతు రోహిత్ రెడ్డి కే కాగా ఆర్యవైశ్య, కుమ్మరి, కమ్మరి సంఘాలు  ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి కే తమ మద్దతు ఇస్తామని తెలిపారు.