యాప్ లో హజరుంటేనే  జీతాలు: కలెక్టర్ నారాయణ రెడ్డి

యాప్ లో హజరుంటేనే  జీతాలు: కలెక్టర్ నారాయణ రెడ్డి
Salaries on attendance bases on app Collector Narayana Reddy

ముద్ర, ప్రతినిధి వికారాబాద్: మన ఊరు మనబడి కింద చేపట్టే పనులను కూడా వేగవంతం చేయాలని సంబంధిత ఇంజనీర్లను కలెక్టర్ ఆదేశించారు. మొదటి విడతలో ఎంపిక చేయబడ్డ పాఠశాలలన్నీ మార్చి 16 వరకు అన్ని పనులు పూర్తి చేసి  31 వరకు పాఠశాలలో ప్రారంభోత్సవాలు కావాలని కలెక్టర్ తెలిపారు.  పాఠశాలల్లో 12 విధాల పనులకు అయితే సంబంధించి ఏఏ దశలో ఉన్నాయో శుక్రవారం వరకు పూర్తి సమాచారాన్ని అందించాలని కలెక్టర్ ఆదేశించారు.

ఆర్థిక సంవత్సరం ఇంకా 40 రోజులే ఉందని, ఎన్ఆర్ఈజీఎస్ తదితర పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.  అటెండెన్స్ యాప్ లో హాజరు లేకుంటే వేతనాలు ఇవ్వబడవని కలెక్టర్ తెలిపారు. ప్రతి ఉద్యోగి అటెండెన్స్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోవాలని, శాఖల వారీగా ఎంతమంది యాప్ ను డౌన్లోడ్ చేసుకున్నారని కలెక్టర్ ఆరా తీశారు. ఎంపీడీవోలు యాప్ లో ఉద్యోగులందరూ ఉండేలా బాధ్యత తీసుకొని పని చేయాలని సూచించారు.