పదో తరగతి ప్రశ్నపత్రం లీక్​

పదో తరగతి ప్రశ్నపత్రం లీక్​

ఎంతో పకడ్బందీగా నిర్వహించవలసిన పదో తరగతి వార్షిక పరీక్షల పేపర్ వికారాబాద్ జిల్లా తాండూర్ వాట్సాప్ సోషల్ మీడియా గ్రూపులలో ముందే చెక్కర్లు కొట్టింది ఉదయం 9:37కే వాట్సాప్ గ్రూప్ లలో వచ్చింది. ఈ విషయంపై అధికారులకు సమాచారం ఇచ్చిన పేపర్ మనది కాదని బుకాయించారు మరోవైపు పరీక్ష సమయం అయిపోయిన తర్వాత 12 గంటల 30 నిమిషాలకు బయటకు వచ్చిన విద్యార్థుల దగ్గర పేపర్ చూడగా ఆ పేపర్ ఈ పేపర్ ఒకటే విధంగా ఉన్నట్టుగా తెలిసింది. దీంతో ముందుగానే పదో తరగతి పరీక్ష పేపర్ లీక్ అయిందని వెలుగులోకి రావడం జరిగింది. పరీక్షా కేంద్రంలోని ఒక ఇన్విజిలేటర్ ఫోన్ ద్వారానే ప్రశ్నాపత్రం నిర్ధారణ నాకు రావడంతో అధికారులు విచారణ చేపట్టారు ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు తెలుస్తోంది