నామినేషన్ వేసిన బీఆర్ఎస్ అభ్యర్థి ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ 

నామినేషన్ వేసిన బీఆర్ఎస్ అభ్యర్థి ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ 

ముద్ర ప్రతినిధి, వికారాబాద్:వికారాబాద్ నియోజకవర్గం బీ ఆర్ఎస్ అభ్యర్థి ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ బుధవారం మధ్యాహ్నం వికారాబాద్ లోని రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో తన నామినేషన్ పత్రాలను సమర్పించారు. అంతకు ముందుగా ఆయన ఎంపీ రంజిత్ రెడ్డి తో కలిసి వికారాబాద్ అనంత పద్మనాభ స్వామి దేవాలయంలో పూజలు నిర్వహించారు.

అనంతరం మాట్లాడుతూ రాష్ట్రంలో మూడవసారి టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారం చేపడుతుందని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాల పట్ల అన్ని వర్గాల ప్రజల్లో భరోసా ఉందని ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సతీమణి సవిత ఆనంద్ మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ లంక పుష్పలత రెడ్డి తదితరులు పాల్గొన్నారు.